Abn logo
Sep 25 2021 @ 02:25AM

చంద్రప్రభ వాహనంపై వినాయకుడు

చంద్రప్రభ వాహనంపై వరసిద్ధుడు- ప్రాకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెస్‌బాబు, శాంతిసాగర్‌రెడ్డి, వెంకటేశు, ఉభయదారులు

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 24: కాణిపాకంలో నిర్వహిస్తున్న వరసిద్ధి వినాయకస్వామి ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారు చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహనసేవకు కాణిపాకం, చినకాంపల్లె, వడ్రాంపల్లె, కొత్తపల్లె, చిగరపల్లె, తిరువణంపల్లె, బొమ్మసముద్రం, అగరంపల్లె, పుణ్యసముద్రం, మారేడుపల్లె, సంతపల్లె, ఉత్తరబ్రాహ్మణపల్లె, కారకాంపల్లె గ్రామాలకు చెందిన హరిజనులు(ఎస్సీలు) ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం ఉభయదారుల ఆధ్వర్యంలో మూల విరాట్‌కు అభిషేకం చేశారు. రాత్రి స్వామికి ఉభయ వరస రావడంతో ఆలయ అలంకార మండపంలో ఉత్సవ విగ్రహాలకు పూజలు జరిగాయి. అనంతరం ఆలయంలోనే ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ఈవో వెంకటేశు, ఎమ్మెల్యే ఎమ్మెస్‌బాబు, సర్పంచ్‌ శాంతిసాగర్‌రెడ్డి, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు శ్రీధర్‌బాబు, కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెకర్‌ కిషోర్‌కుమార్‌రెడ్డి, ఉభయదారులు పాల్గొన్నారు.

పట్టువస్త్రాలు తీసుకొస్తున్న విశ్రాంత ఏడీసీ కేశవులు, కుటుంబీకులు

వరసిద్ధుడికి పట్ట్టు వస్త్రాల సమర్పణ

చంద్రప్రభ వాహన సేవను పురస్కరించుకుని విశ్రాంత ఏడీసీ జి.కేశవులు తన కుటుంబీకులతో కలిసి వరసిద్ధుడికి శుక్రవారం పట్టువస్త్రాలను సమర్పించారు. ఏటా చంద్రప్రభ వాహన సేవ రోజున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా అగరంపల్లెలోని తన స్వగృహం నుంచి పట్టు వస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చి, ఆలయ అధికారులకు అందజేశారు. 

స్వర్ణ ధ్వజస్తంభానికి పుష్పాలంకరణ - ఆకట్టుకుంటోన్న అణివేటి మండపం

ప్రత్యేక ఉత్సవాల్లో నేడు 

ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా శనివారం వరసిద్ధుడికి పుష్పపల్లకి సేవ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి  భాగ్యలక్ష్మి, శేషాద్రినాయుడు అండ్‌ బ్రదర్స్‌, మోహన్‌నాయుడు అండ్‌ బ్రదర్స్‌, వీటీ రాజన్‌ అండ్‌ బ్రదర్స్‌, రామనాథ నాయుడు, కృష్ణమూర్తి నాయుడు, నరసిహారెడ్డి అండ్‌ సన్స్‌, రాజారెడ్డి అండ్‌కో, శ్రీరాములరెడ్డి,  బాలకృష్ణారెడ్డి, శ్రీమొగిలీశ్వర  ఏజెన్సీ, శేషయ్య నాయుడు అండ్‌ సన్స్‌, రాధారాం బోర్‌ వెల్స్‌, కుమారేంద్ర చౌదరి, మనోహర్‌నాయుడు అండ్‌ బ్రదర్స్‌, ఆంజినేయులు నాయుడు అండ్‌ సన్స్‌ ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.