ప్రకృతి వైద్యం పేరుతో వ్యభిచారం.. 13 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2021-12-26T01:30:05+05:30 IST

మైనర్ బాలికను వ్యభిచార వృత్తిలోకి దించిన ముఠాను అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్, డీఎస్పీ సుప్రజ మీడియాకు వివరించారు..

ప్రకృతి వైద్యం పేరుతో వ్యభిచారం.. 13 మంది అరెస్ట్

గుంటూరు: మైనర్ బాలికను వ్యభిచార వృత్తిలోకి దించిన ముఠాను అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫీజ్, డీఎస్పీ సుప్రజ మీడియాకు వివరించారు. ‘‘మొత్తం ఇరవై మూడు మంది  ముఠాలో ఉన్నారు. పదిమంది ఆర్గనైజర్స్ ఉన్నారు. కరోనా సమయంలో జీజీహెచ్‌లో చేరిన బాలికకు మాయ మాటలు చెప్పి స్వర్ణ కుమారి తీసుకెళ్ళింది. ప్రకృతి వైద్యం పేరుతో తీసుకెళ్ళి వ్యభిచారం చేయించింది. విజయవాడ, హైదరాబాద్, కాకినాడ, నెల్లూరుల్లో వ్యభిచారం చేయించారు. నెల్లూరు నుంచి పారిపోయి విజయవాడ వచ్చిన బాలికను పట్టుకొని తిరిగి వ్యభిచారం చేయించారు. అనారోగ్యం బారిన పడటంతో బాలికను వదిలి పెట్టారు. పదమూడు మందిని అరెస్ట్ చేశాం’’ అని తెలిపారు. 

Updated Date - 2021-12-26T01:30:05+05:30 IST