Abn logo
Oct 21 2021 @ 23:43PM

రాష్ట్రంలో గూండాల పాలన

మాట్లాడుతున్న టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ

  1. ఆలూరులో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ 


ఆలూరు,అక్టోబరు, 21: వైసీపీ ప్రభుత్వం గూండాల పాలన సాగిస్తున్నదని, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిజస్వరూపం ఏమిటో ప్రజలందరికీ  తెలిసిందని ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి కోట్ల సుజాతమ్మ అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ భవన్‌లో చేపట్టిన దీక్షకు మద్దతుగా ఆలూరు టీడీపీ కార్యాలయంలో ఆమె దీక్ష చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం గుండాలను పెట్టి పోషిస్తున్నదని అన్నారు. వారి దౌర్జన్యాలను రాష్ట్ర ప్రజలు మీడియా ద్వారా చూశారని అన్నారు. దీక్షలో తెలుగురైతు కమిటీ రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే లోకనాథ్‌, ఆలూరు, హొళగుంద కన్వీనర్లు అశోక్‌యాదవ్‌, వీరన్నగౌడ్‌, చిప్పగిరి మాజీ జడ్పీటీసీ మీనాక్షినాయుడు, పాల్‌రెడ్డి, నాయకులు నరసప్ప, హెబ్బటం విష్ణురెడ్డి, ఆలూరు సర్పంచ్‌ అరుణాదేవి, చిప్పగిరి మండల కన్వీనర్‌ వలిబాషా, పెద్దహోతూరు సర్పంచ్‌ జొహరాపురం లక్ష్మన్న, ఎంపీటీసీ చిన్నయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.


టీడీపీ కార్యాలయాలపై, నేతల ఇళ్లపై వైసీపీ దాడులకు నిరసనగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడు విజయవాడలోని మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో చేపట్టిన 36 గంటల దీక్షకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జునచౌదరి గురువారం వంద మంది కార్యకర్తలతో కలిసి వెళ్లి సంఘీభావం ప్రకటించారు. వైసీపీ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసేందుకు తామంతా పోరాడుతామని ఆయన అన్నారు. ఆయన వెంట టీడీపీ నాయకులు మారుతి, ఎల్లంకి నారాయణస్వామి, మాజీ ఎంపీపీ భీమలింగప్ప, అనిల్‌, జహీర్‌, హరి, నరసప్ప, కారుమంచి, గురుస్వామి ఉన్నారు.


ఎమ్మిగనూరు: పాలన చేతగాక ప్రజల దృష్టిని మరల్చేందుకు అరాచకాలు సృష్టిస్తూ.. రాష్ర్టాన్ని రావణకాష్టంగా అధికార వైసీపీ నాయకులు మార్చారని టీడీపీ మంత్రాలయం ఇన్‌చార్జి పాలకుర్తి తిక్కారెడ్డి ఆరోపించారు. గురువారం ఎమ్మిగనూరులో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులను బూతులు తిడుతున్నారని, ప్రభుత్వం అక్రమకేసులు బనాయిస్తోందని అన్నారు. మంత్రి కొడాలి నానితో పాటు ఇతర మంత్రులు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని అన్నారు. 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును, టీడీపీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రి లోకేష్‌ను ఇష్టానుసారంగా నిందిస్తున్నారని అన్నారు. నాయకుల ఇళ్లపైనా, పార్టీ కార్యాలయాలపైనా దాడులు చేసి, కేసులు పట్టారని అన్నారు. ప్రజలు తగిన సమయంలో వైసీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. దాడులను నిరసిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేపట్టిన దీక్షకు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్రకార్యదర్శి శ్రీనివాసరెడ్డి, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి దివాకర్‌ రెడ్డి పాల్గొన్నారు. 


కౌతాళం: రాష్ట్రంలో వైసీపీ గూండాయిజం పెరిగిపోయిందని టీడీపీ సీనియర్‌ నాయకులు ఉలిగయ్య, చెన్నబసప్ప అన్నారు. గురువారం వారు విలేఖర్లతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం కాకుండా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు జరుపుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని, ఇది మంచి సాంప్రదాయం కాదని అన్నారు. ప్రజాగళాన్ని వినిపిస్తున్న ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలపై, నాయకులపై దాడులకు పాల్పడటం దారుణమని అన్నారు. రాజకీయాల్లో విధానపరమైన చర్చలు ఉండాలేగాని దాడులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వెంకటపతిరాజు, అడివప్పగౌడ్‌, సురేష్‌నాయుడు, కొట్రేష్‌గౌడ్‌, సాయిభాభా, మోహన్‌రెడ్డి, కురువవీరేష్‌, రామలింగ, రాజానంద్‌, మంజు తదితరులు పాల్గొన్నారు.


మంత్రాలయం: రాష్ట్రంలో వైసీపీ అరాచకపాలన సాగిస్తోందని టీడీపీ జిల్లా నాయకుడు బూదురు మల్లికార్జున రెడ్డి, అధికార ప్రతినిధి చావడి వెంకటే ష్‌, వగరూరు మాజీ సర్పంచ్‌ రామిరెడ్డి, అబ్దుల్లా అన్నారు. గురువారం అమరావతిలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ కార్యాలయాలపై భౌతిక దాడులు చేయడం అన్యాయమని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రజాస్వామ్యయుతంగా పాలన సాగాలన్నారు. వైసీపీ అరాచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధిచెబుతారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గువ్వల భీమన్న, చంద్ర, వీరేష్‌, లక్ష్మన్న, భీమన్న పాల్గొన్నారు.