హైదరాబాద్‌లో గ్యాంగ్ వార్

ABN , First Publish Date - 2021-01-18T00:54:20+05:30 IST

నగరంలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో నడిరోడ్డుపై ఇరువర్గాలు దాడి చేసుకున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో..

హైదరాబాద్‌లో గ్యాంగ్ వార్

హైదరాబాద్‌: నగరంలో గ్యాంగ్ వార్ కలకలం రేపింది. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో నడిరోడ్డుపై ఇరువర్గాలు దాడి చేసుకున్నాయి. ఆర్థిక లావాదేవీల విషయంలో ఘర్షణకు దిగినట్లు సమాచారం. అరగంటకు పైగా రోడ్డుపై హంగామా చేశారు. దీంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి. మద్యం మత్తులో యువకులు కొట్టుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లడంతో అక్కడున్న యువకులు పరారయ్యారు. కేసు నమోదు చేసిన పోలీసులు స్థానిక సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. 


Updated Date - 2021-01-18T00:54:20+05:30 IST