Abn logo
Aug 3 2021 @ 23:13PM

గంగ్యాడ వీఆర్‌ఏ సస్పెన్షన్‌

నవాబుపేట: రైతును మోసం చేసి ఐదెకరాల 12 గుంటల భూమిని కాజేసిన గంగ్యాడ వీఆర్‌ఏను సస్పెండ్‌ చేస్తున్నట్లు డిప్యూటీ తహసీల్దార్‌ రమేష్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతు ఆలూరి చిన్న పర్మయ్య కొత్త పాస్‌పుస్తకం కోసం సర్పంచ్‌ భర్త మల్లేషం, వీఆర్‌ఏ కావలి మహే్‌షకుమార్‌లను సంప్రదించగా రూ.11 వేలు తీసుకొని రైతును మోసం చేశారని తెలిపారు. సర్పంచ్‌ భర్త ప్రోద్భలంతో వీఆర్‌ఏ ఇందులో భాగస్వామి అయినందున సస్పెండ్‌ చేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా కుట్రకు కారణమైన వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని బాధిత రైతు, గ్రామస్థులు డిమాండ్‌ చేశారు.