వజ్రకిరీటంలో గంగమ్మ

ABN , First Publish Date - 2020-12-05T06:55:15+05:30 IST

అమ్మవారిని వజ్రకిరీటం, బంగారు ముఖకవచం, వెండి చీర, ఇతర ఢమరుకం, కత్తి తదితర ఆభరణాలతో అలంకరించారు.

వజ్రకిరీటంలో గంగమ్మ

తిరుపతి (కల్చరల్‌), డిసెంబరు 4: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అర్చకుడు మురళీస్వామి ఆధ్వర్యంలో ఏకాంతంగా అభిషేకం చేశారు. అమ్మవారిని వజ్రకిరీటం, బంగారు ముఖకవచం, వెండి చీర, ఇతర ఢమరుకం, కత్తి తదితర ఆభరణాలతో అలంకరించారు. నగరవాసులే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి దేదీప్యమానమైన అమ్మవారి దివ్యసౌందర్యాన్ని నేత్రపర్వంగా తిలకించి తరించారు. ఆలయ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి, ఈవో మునికృష్ణయ్య, ధర్మకర్తల మండలి సభ్యులు చెంగల్రాజు, జీవరత్నం, మోహన్‌యాదవ్‌, గౌరి, రాజేశ్వరి, ఉష, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.


Updated Date - 2020-12-05T06:55:15+05:30 IST