Abn logo
Aug 2 2021 @ 00:55AM

గంగానమ్మకు ఆషాఢ సారె

ఆషాఢ సారెను ఊరేగింపుగా తీసుకువెళుతున్న భక్తులు

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌, ఆగస్టు 1 : ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ దేవతలకు, దుర్గమ్మకు ఆషాఢ సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమని సమరసత సేవా ఫౌండేషన్‌ మండల కన్వీనర్‌ ఎదురువాడ శ్రీనివాసరావు అన్నారు.  ఆదివారం రంగయ్యప్పారావు పేటలో హిందూ ధర్మ ప్రచార సమితి సమరసత సేవా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మహిళలు గంగానమ్మకు ఘనంగా ఆషాఢ సారెను సమర్పించారు. రామాల యంలో ప్రత్యేక పూజలనంతరం జైదుర్గమ్మ నామస్మరణతో ఊరేగింపుగా గంగానమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి సారె సమర్పించారు. మహిళా భక్తుల సహకారంతో 15 గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు యడవల్లి పాండు రంగారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో దావులూరి ఉమాదేవి, లింగం పద్మజ్యోతి, దొడ్డపనేని సుశీల, పద్మ, గంగాభవాని, మహిళ భక్త బృందం పాల్గొన్నారు.