కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పేద కుటుంబాలకు వరం

ABN , First Publish Date - 2020-10-28T11:27:00+05:30 IST

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం పేద కుటుంబాలకు వరంలాంటిదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పేద కుటుంబాలకు వరం

గంగుల కమలాకర్‌


కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 27: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకం పేద కుటుంబాలకు వరంలాంటిదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో 2.58 కోట్ల రూపాయల విలువ గల చెక్కులను 258 మంది లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కష్టకాలంలోనూ సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. కరోనా లాంటి విపత్కరి పరిస్థితుల్లో కూడా పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో మేయర్‌ వై సునీల్‌రావు, మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, ఎంపీపీలు పిల్లి శ్రీలత, తిప్పర్తి లక్ష్మయ్య, సుంకిశాల సంపత్‌రావు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-28T11:27:00+05:30 IST