గంగూలీ, రొనాల్డో దాతృత్వం

ABN , First Publish Date - 2020-03-26T09:45:33+05:30 IST

కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ క్రీడాకారులు ఒక్కొక్కరుగా ముం దుకు వస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ 50 లక్షల విలువ చేసే బియ్యాన్ని...

గంగూలీ, రొనాల్డో దాతృత్వం

న్యూఢిల్లీ: కరోనా బాధితులను ఆదుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దిగ్గజ క్రీడాకారులు ఒక్కొక్కరుగా ముం దుకు వస్తున్నారు. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ 50 లక్షల విలువ చేసే బియ్యాన్ని ప్రభుత్వానికి అందించాడు. పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో తమ దేశంలోని రెండు ఆస్పత్రులకు ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్స్‌ (ఐసీయూ)ను విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించాడు. స్విస్‌ టెన్నిస్‌ స్టార్‌ రోజర్‌ ఫెడరర్‌ స్విట్జర్లాండ్‌ ప్రభుత్వానికి రూ.7.70 కోట్లను విరాళంగా ఇచ్చాడు. కరోనాపై సమష్టిగా పోరాడాలని..ప్రమాదంలో ఉన్న కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఫెడరర్‌ కోరాడు.


ఈడెన్‌ గార్డెన్స్‌ను ఉపయోగించుకోండి

 ప్రభుత్వం కోరితే ఐసోలేషన్‌ సెంటర్‌గా ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియాన్ని ఉపయోగించుకోవడానికి తక్షణమే ఇస్తామని సౌరవ్‌ గంగూలీ  తెలియజేశాడు. ఆటగాళ్ల గదులతో పాటు స్టేడియంలోని డార్మెటరీని వినియోగించుకోవచ్చునని సూ చించాడు. గంగూలీ దారిలోనే హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, పుదుచ్చేరి క్రికెట్‌ సంఘం కూడా తమ స్టేడియాలను ప్రభుత్వాలు ఉపయోగించుకోవచ్చునని తెలిపాయి.


Updated Date - 2020-03-26T09:45:33+05:30 IST