Advertisement
Advertisement
Abn logo
Advertisement

భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన గంగూలీ

న్యూఢిల్లీ: భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న శత్రుత్వం కారణంగా ఇరు దేశాల మధ్య క్రీడలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. క్రీడల్లో ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగక సంవత్సరాలు గడిచిపోయాయి. ఉగ్రవాదం, చొరబాట్లు, కశ్మీర్.. ఇలా పలు అంశాలు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి. ఇవి ఇరు దేశాల మధ్య క్రీడలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తటస్థ వేదికలపై తప్ప సొంత దేశాల్లో పోటీలు జగడం లేదు.  


ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ఈ విషయంలో తాము నిస్సహాయులమని, తమ చేతుల్లో ఏమీ లేదని తేల్చి చెప్పాడు. ద్వైపాక్షిక సిరీస్ అంశం కేంద్రం పరిధిలోనిదని పేర్కొన్నాడు. ఇదే విషయమై పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా కూడా ఇటీవల ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. ద్వైపాక్షిక సిరీస్‌లపై నిర్ణయం తీసుకోవాల్సింది ఇరు దేశాల ప్రభుత్వాలేనని, బీసీసీఐ కానీ, పీసీబీ కానీ ఆ పని చేయలేవని పేర్కొన్నాడు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement