ఆ వైరానికి కారణం గంగూలీనే.. షాకింగ్ నిజం చెప్పిన దిగ్గజ స్పిన్నర్!

ABN , First Publish Date - 2021-01-13T23:25:12+05:30 IST

ప్రపంచ క్రికెట్లో నెంబర్ వన్ వైరం భారత్-పాకిస్తాన్ జట్ల మధ్యే. ఆ తర్వాత భారత అభిమానులు అంతగా ఎగ్జయిట్ ఫీలయ్యేది భారత్-ఆస్ట్రేలియా సిరీసుల విషయంలోనే.

ఆ వైరానికి కారణం గంగూలీనే.. షాకింగ్ నిజం చెప్పిన దిగ్గజ స్పిన్నర్!

సిడ్నీ: ప్రపంచ క్రికెట్లో నెంబర్ వన్ వైరం భారత్-పాకిస్తాన్ జట్ల మధ్యే. ఆ తర్వాత భారత అభిమానులు అంతగా ఎగ్జయిట్ ఫీలయ్యేది భారత్-ఆస్ట్రేలియా సిరీసుల విషయంలోనే. అయితే ఇలా ఈ రెండు జట్ల మధ్య ఇంత వైరం పెరగడానికి కారణం భారత మాజీ సారధి సౌరవ్ గంగూలీనే అట. ఈ విషయాన్ని ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ బయట పెట్టాడు. గతంలో వేరే దేశాలు ఆస్ట్రేలియా టూర్లకు వచ్చినప్పుడు ఆసీస్ ఆటగాళ్లు స్లెడ్జింగ్ చేసేవారు. భారత్ నుంచి అంతకు ముందు వచ్చిన ఏ కెప్టెనూ ఈ స్లెడ్జింగ్‌కు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు. కానీ గంగూలీ మాత్రం తనే మాటలతో రెచ్చగొట్టేవాడని హాగ్ చెప్పాడు. ‘ఓసారి టాస్ వేస్తున్నప్పుడు మా కెప్టెన్ స్టీవ్ వా కొంచెం నిదానంగా వచ్చాడు. అంతే గంగూలీ వెంటనే నోటికి పని కల్పించాడు. స్టీవ్ వాపై కామెంట్లు చేశాడు’ అని హాగ్ గుర్తు చేసుకున్నాడు. ఇలా మాటల యుద్ధానికి దిగిన తొలి భారత కెప్టెన్ గంగూలీనే అని, అతని వల్లే ఈ రెండు జట్ల మధ్య ప్రస్తుతం అద్భుతమైన క్రీడా వైరం ఉందని హాగ్ చెప్పాడు. హాగ్ మాటలను బట్టి చూస్తే.. దాదా కారణంగానే ప్రస్తుతం మనం ఇంత ఎగ్జయిటింగ్ సిరీసులు చూడగలుగుతున్నామని అనిపిస్తోంది కదూ.

Updated Date - 2021-01-13T23:25:12+05:30 IST