ఆ విషయంలో గంగూలీ తరువాతే ఎవరైనా: ఇర్ఫాన్ పఠాన్

ABN , First Publish Date - 2020-08-04T01:18:23+05:30 IST

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ఆకాశానికెత్తేస్తున్నాడు. ఆటగాళ్లను..

ఆ విషయంలో గంగూలీ తరువాతే ఎవరైనా: ఇర్ఫాన్ పఠాన్

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ ఆకాశానికెత్తేస్తున్నాడు. ఆటగాళ్లను గంగూలీలా ఎవరూ అర్థం చేసుకోలేరని, తోటి ప్లేయర్లపై గంగూలీకి అపారమైన నమ్మకం ఉండేదని పఠాన్ చెబుతున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇర్ఫాన్ గంగూలీ గురించి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నప్పుడు గంగూలీ ఎప్పుడూ జట్టు గురించే ఆలోచించేవాడని, జట్టు పటిష్ఠపరచడం గురించే అనుక్షణం ఆలోచించేవాడని చెప్పాడు. ‘భారత క్రికెట్ జట్టుకు సరైన నాయకుడు ఎప్పటికీ గంగూలీనే. ఎప్పుడూ జట్టును పటిష్ఠపరచాలనే ఆలోచించేవాడు. ముఖ్యంగా ఆటగాళ్లలోని ప్రతిభను ముందుగా గుర్తించడంలో అతడికి అతడే సాటి. కొంత ప్రోత్సాహం ఇస్తే అద్భుతంగా ఆడగల ఆటగాళ్లను గుర్తించి వారికి జట్టులో స్థానం కల్పించేవాడు. విశేషం ఏంటంటే గంగూలీ అలా తీసుకున్న ఆటగాళ్లందరూ అతడి అంచనాలకు కచ్చితంగా అందుకున్నారు. అనతికాలంలోనే జట్టులో ముఖ్యమైన ఆటగాళ్లుగా మారారు. ప్రస్తుతం భారత అభిమానుల గుండెల్లే వారికంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అందుకే గంగూలీనే భారత బెస్ట్ కెప్టెన్ అనడానికి ఏ మాత్రం సందేహించను’ అని ఇర్ఫాన్ పేర్కొన్నాడు.

Updated Date - 2020-08-04T01:18:23+05:30 IST