వాళ్ల విలువ తెలిసిందా?.. చురకలేసిన గంగూలీ!

ABN , First Publish Date - 2021-01-12T03:15:22+05:30 IST

ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అద్భుత పోరాట పటిమను చూపించి, మ్యాచ్‌ను డ్రాగా ముగించిన టీమిండియాకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.

వాళ్ల విలువ తెలిసిందా?.. చురకలేసిన గంగూలీ!

న్యూఢిల్లీ: ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో అద్భుత పోరాట పటిమను చూపించి, మ్యాచ్‌ను డ్రాగా ముగించిన టీమిండియాకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా మన జట్టును అభినందించాడు. అదే సమయంలో జట్టును విమర్శించిన ఫ్యాన్స్, క్రిటిక్స్‌ను కూడా మర్చిపోలేదు. వీళ్లందరికీ చురకలేస్తూ ఓ ట్వీట్ చేశారు. ‘‘ఇప్పుడు విమర్శకులందరికీ పుజారా, పంత్, అశ్విన్ విలువ తెలిసిందా? అత్యుత్తమ బౌలింగ్‌ను ఎదుర్కొంటూ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం అంటే మాటలు కాదు. ఎప్పుడూ బంతిని బౌండరీలు దాటించడమే ఆట కాదు. అలాగే దాదాపు 400 వికెట్లు ఉత్తినే వస్తాయా? ఇండియా అద్భుతంగా పోరాడావ్. సిరీస్‌ను గెలిచే సమయం వచ్చేసింది’’ అని దాదా ట్వీట్ చేశాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో పుజారా, పంత్, అశ్విన్‌లు ఉండటాన్ని కొందరు క్రిటిక్స్, ఫ్యాన్స్ ప్రశ్నించిన విషయం తెలిసిందే.



Updated Date - 2021-01-12T03:15:22+05:30 IST