Abn logo
Oct 24 2021 @ 15:44PM

పి.గన్నవరం మండలంలో వరుస చోరీలు

అమరావతి: మండలంలో వరుస చోరీలతో ప్రజలు హడలిపోతున్నారు. పి.గన్నవరం మండలం పోతవరంలో వరుసగా చోరీలు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నందెపు శ్యామలరావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో 100 కాసుల బంగారం, 5 కేజీల వెండిని దుండగులు అపహరించారు. దొంగలను గుర్తించకుండా ఇళ్లంతా కారం జల్లి పరారయ్యారు. ఘటన స్థలాన్ని అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. క్లూస్ టీమ్‌తో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా రెండు రోజులనుండి ఒకే ప్రాంతంలో దొంగతనాలు జరగటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఘటన స్థలాన్ని ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పరిశీలించారు.

ఇవి కూడా చదవండిImage Caption