Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంబేడ్కర్‌ విగ్రహ సమస్య పరిష్కరించాలి

పాలకోడేరు, నవంబరు 29 : గరగపర్రులో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటు సమస్యను పరిష్కరించాలని బీఎస్పీ రాష్ట్ర కో–ఆర్డినేటర్‌ చిత్రసేను, జిల్లా అధ్యక్షుడు పొట్ల సురేష్‌ కోరా రు. గ్రామంలో దళితులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా  వారు మాట్లాడు తూ అంబేడ్కర్‌ విగ్రహ విషయంలో అన్యాయం జరిగి నా లుగేళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం తగద న్నారు. మండలి చైౖర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు సమస్యను పరిష్కరించకపోగా ఉద్యమ నాయకులు పైనే కేసులు పెట్టించటం దారుణం అన్నారు.  బీఎస్పీ నాయకులు ఏలూరి అశోక్‌కుమార్‌, నల్లి రమేష్‌, దేవాబత్తులు సింగ్‌, పాండురంగ, గరగపర్రు దళితనాయకులు, వెంకటరత్నం, దళితులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement