గరంగరంగా సర్వసభ్య సమావేశం

ABN , First Publish Date - 2022-03-06T06:50:00+05:30 IST

మండలంలోని స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పెందూర్‌ అమృత్‌రావు అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్య లు పరిష్కరించడంలో అధికారులకు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని

గరంగరంగా సర్వసభ్య సమావేశం
మిషన్‌ భగీరథ ఏఈని నిలదీస్తున్న కన్నాపూర్‌ సర్పంచ్‌ కుమ్ర రఘురాం

‘మిషన్‌ భగీరథ’ పని తీరుపై మండిపడ్డ ప్రజాప్రతినిఽధులు

సిరికొండ, మార్చి 5: మండలంలోని స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ పెందూర్‌ అమృత్‌రావు అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశం గరంగరంగా సాగింది. గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్య లు పరిష్కరించడంలో అధికారులకు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల సర్పంచ్‌లు అధికారులపై మండిపడ్డారు. ప్రతీ మూడు నెలల కొకసారి జరిగే సమావేశానికి కూడా సంబంధిత అధికారులు డుమ్మా కొట్టి,  కిందిస్థాయి సిబ్బందిని  పంపించడంతో తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజాప్రతినిధులు వాపోయారు. మొత్తం 17 అంశాలపై సమీక్షా నిర్వహిం చగా మిషన్‌ భగీరథ, అటవీశాఖ, విద్యుత్‌ శాఖాధికారుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా సమావేశంలో రెవెన్యూ అధికారి తన నివేధికను చది వి వినిపించారు. ఆ తర్వాత ఉపాదిహమీ ఏపీవో మాట్లాడుతూ ఇప్పటికే మండ ల పరిధిలో జాబ్‌కార్డు ఉన్న ప్రతీ ఒక్కరికి వంద రోజుల పని కల్పించడం జరి గిందన్నారు. ఐసీడీయస్‌ సూపర్‌వైజర్‌ ఉమారాణి మాట్లాడుతూ మండలంలోని 42 అంగన్‌వాడీ సెంటర్‌లలో గర్బీణులకు, పిల్లలకు పోషాకాహారం అందుతుం దని ఆమె తెలిపారు. అనంతరం మిషన్‌ భగీరథ జేఈ జైపాల్‌ తన నివేధికను వినిపిస్తుండగా ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా లేచి ఆర్‌డబ్లూఎస్‌ అధికారులపై మండిపడ్డారు. విద్యుత్‌అధికారులు సైతం తమ విధులు సక్రమంగా నిర్వహించ డం లేదని, డెవలఫ్‌మెంట్‌ చార్జీలు చెల్లించలేక చాలా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మీదట సమావేశానికి మండల అధికారులతో పాటు డివిజన్‌స్థాయి అధికారులు కూడా హజరయ్యేలా చూడాలని ఎంపీడీవోకు సూచిం చారు. అయితే ఈ సమావేశంలో సర్పంచ్‌ల స్థానంలో సతులకు బదులు వారి పతులు పాల్గొనడం గమనార్హం. సమావేశంలో వైస్‌ ఎంపీపీ సాగరబాయి, జడ్పీ టీసీ కుమ్ర చంద్రకళ, ఎంపీవో అతుల్‌ కుమార్‌, మిషన్‌ భగీరథ డీఈ వెంకటేశ్వర్లు,  ఐకేపీ ఏపీఎం సంతోష్‌, ఎంపీటీసీలు, తదితరులున్నారు. 

Updated Date - 2022-03-06T06:50:00+05:30 IST