Advertisement
Advertisement
Abn logo
Advertisement

విమర్శనాలోకనం గ్రంథావిష్కరణ

గుంటూరు(సాంస్కృతికం), నవంబరు 26: సున్నిత విమర్శ అవసరమని, దీని వలన భవిష్యత్తులో సరిదిద్దుకునే అవకాశం కలుగుతుందని సాహితీవేత్త డాక్టర్‌ మువ్వా వృషాధిపతి అన్నారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారకా తిరుమలరావు సహోదరి, రచయిత్రి డాక్టర్‌ సీహెచ్‌ సుశీలమ్మ రచించిన విమర్శనాలోకనం గ్రంథావిష్కరణ సభ శుక్రవారం బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఘనంగా జరిగింది. ద్వారకాతిరుమల రావు తండ్రి సీహెచ్‌ లక్ష్మీనారాయణ పేరిట ఏర్పాటైన స్మారక సాహితీ పురస్కారాన్ని ప్రముఖ సాహితీ విమర్శకులు ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డికి అందజేశారు. ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ ఆవిష్కరించిన విమర్శనాలోకనం పుస్తకాన్ని డాక్టర్‌ సీహెచ్‌ ప్రసూనాంబ, డాక్టర్‌ కె.కిశోర్‌ ప్రసాద్‌లకు అంకితం ఇచ్చారు. సభలో ప్రముఖ రచయిత వల్లూరి శివప్రసాద్‌, సాహితీవేత్త డాక్టర్‌ బూసురపల్లి వెంకటేశ్వర్లు, రిటైర్డ్‌ ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ జి.కోటేశ్వరరావు, డాక్టర్‌ ఓరుగంటి వెంకటరమణ, రచయిత్రి డాక్టర్‌ సీహెచ్‌ సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు. 

  

Advertisement
Advertisement