చక్కటి నిద్రకు వెల్లుల్లి!

ABN , First Publish Date - 2021-01-11T06:01:00+05:30 IST

వెల్లుల్లిని వంటల్లో విరివిగా ఉపయోగిస్తాం. కానీ దీని ఉపయోగాలు బెడ్‌రూములో కూడా ఉన్నాయి. మీ దిండు కింద

చక్కటి నిద్రకు వెల్లుల్లి!

వెల్లుల్లిని వంటల్లో విరివిగా ఉపయోగిస్తాం. కానీ దీని ఉపయోగాలు బెడ్‌రూములో కూడా ఉన్నాయి. మీ దిండు కింద వెల్లుల్లి పాయలను రెండింటిని పెట్టుకుని పడుకుంటే మంచి నిద్ర పడుతుంది. వెల్లుల్లి వాసన ప్రభావం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. దాంతో వెంటనే మీరు నిద్రలోకి జారుకుంటారు.


అందుకే పొట్టు వొలిచిన రెండు వెల్లుల్లి పాయల్ని మీ దిండు కింద పెట్టుకుని పడుకుని చూడండి. దాని ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో మీరే స్వయంగా చూడొచ్చని అంటున్నారు పరిశోధకులు. బెడ్‌ వెల్లుల్లి వాసన వస్తుందని గానీ, లేదా మీ శరీరానికి వెల్లుల్లి వాసన అంటుతుందని గానీ ఆందోళన చెందాల్సిన పనిలేదు.

Updated Date - 2021-01-11T06:01:00+05:30 IST