నూజివీడులో గ్యాస్ పైప్‌లైన్ లీకేజ్ ఎగిసిపడుతున్న మంటలు

ABN , First Publish Date - 2021-10-21T23:43:29+05:30 IST

నూజివీడు పట్టణంలో మెగా గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ వల్ల మంటలు ఎగిసిపడుతున్నాయి. హనుమాన్ జంక్షన్ రోడ్లో సూపర్ మార్కెట్

నూజివీడులో గ్యాస్ పైప్‌లైన్ లీకేజ్ ఎగిసిపడుతున్న మంటలు

నూజివీడు: నూజివీడు పట్టణంలో మెగా గ్యాస్ పైప్ లైన్ లీకేజ్ వల్ల మంటలు ఎగిసిపడుతున్నాయి. హనుమాన్ జంక్షన్ రోడ్లో సూపర్ మార్కెట్ వద్ద చెత్త‌కు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా పైప్ లైన్ లీకేజ్ అయి మంటలు ఎగసిపడుతున్నాయి. భారీగా ఎగసిపడుతున్న మంటలతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మెగా గ్యాస్ పైప్ లైన్ సిబ్బందికి సమాచారం అందించి గ్యాస్ రన్నింగ్‌‌ను పోలీసులు ఆపేశారు. మంటలను పట్టణ పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - 2021-10-21T23:43:29+05:30 IST