Advertisement
Advertisement
Abn logo
Advertisement

బిల్‌గేట్స్‌తో మిలిందా విడాకులు అందుకేనా..?!

న్యూయార్క్: మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్‌, ఆయన సతీమణి మిలిందా గేట్స్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మూడు దశాబ్దాల తమ వైవాహిక బంధానికి ముగింపు పలకబోతున్నట్లు గేట్స్ దంపతులు ప్రకటించారు. అయితే, ఇప్పటివరకూ ఈ విడాకుల వెనుక ఉన్న సరియైన కారణం మాత్రం తెలియరాలేదు. అటు గేల్స్ దంపతులు కూడా దీనిపై నోరు విప్పలేదు. కానీ, తాజాగా ప్రముఖ జర్నల్ వాల్​స్ట్రీట్​.. బిల్​గేట్స్​తో మిలిందా విడాకులు తీసుకోవడానికి గల కారణంపై ఓ ఆసక్తికరమైన కథనాన్ని ప్రచురించింది. లైంగిక వేధింపుల ఆరోపణల్లో శిక్ష పడిన వ్యక్తితో బిల్​​ సన్నిహితంగా మెలగడమే ఈ విడాకులకు కారణమని తన కథనంలో పేర్కొంది. వాల్​స్ట్రీట్ కథనం ప్రకారం ఇంతకు బిల్‌గేట్స్ ఎవరితో సన్నిహితంగా మెలిగారు? మిలిందా విడాకుల నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

జెఫ్రీ ఎప్‌స్టీన్‌

బిల్ సన్నిహితంగా మెలిగిన వ్యక్తి ఎవరో కాదు. ఫైనాన్షియర్‌ అయిన జెఫ్రీ ఎడ్వర్డ్‌ ఎప్‌స్టీన్‌. బాలికలు, మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం వంటి ఆరోపణలపై 2019లో ఎప్‌స్టీన్ అరెస్ట్ అయ్యాడు. ఇలా నేరారోపణలు గల వ్యక్తితో బిల్ సాన్నిహిత్యం కొనసాగించడం మిలిందాకు నచ్చలేదు. గేట్స్ దంపతుల మధ్య పలుమార్లు ఈ విషయమై చిన్నపాటి ఘర్షణలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. లైంగిక వేధింపుల ఆరోపణల్లో శిక్ష పడిన వ్యక్తితో బిల్‌గేట్స్‌ సన్నిహితంగా మెలగడంపై మిలిందా అభ్యంతరం తెలిపారు. అయితే ఎప్‌స్టీన్‌తో తాను ఆధ్యాత్మిక విషయాలు మాత్రమే చర్చిస్తున్నానని బిల్‌గేట్స్‌ గతంలో వివరణ కూడా ఇచ్చారు. 2013 నుంచి ఎప్‌స్టీన్‌ను బిల్‌గేట్స్‌ కలుస్తూనే వచ్చారు. 

బిల్‌గేట్స్‌‌తో ఎప్‌స్టీన్‌..

ఒకసారి ఎప్‌స్టీన్‌ ఇంటిలో రాత్రంతా బిల్‌గేట్స్‌ గడిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బిల్‌తో విడిపోవాలని మిలిందా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అందుకే బిల్‌గేట్స్‌తో విడాకులు తీసుకోవాలన్న నిర్ణయాన్ని మిలిందా 2019లోనే తీసుకున్నట్లు, అప్పటి నుంచే ఆమె విడాకుల న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తన కథనంలో పేర్కొంది. దీని ప్రకారం లైంగిక నేరాభియోగాలు ఎదుర్కొంటున్న జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో బిల్‌గేట్స్‌ సంబంధాలే వివాహబంధం తెగిపోవడానికి కారణమైందని తెలుస్తోంది. ఇక వృత్తిపరంగా ఫైనాన్షియర్‌ అయిన జెఫ్రీ ఎడ్వర్డ్‌ ఎప్‌స్టీన్‌.. బాలికలు, మహిళల అక్రమ రవాణా, వ్యభిచారం కేసుల్లో 2019 జులైలో అరెస్టయ్యాడు. న్యాయస్థానంలో కేసు విచారణలో దశలో ఉండగానే అదే ఏడాది జైల్లోనే మృతిచెందాడు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement