May 18 2021 @ 23:53PM

కొద్దిగా తెలుసుకుని మాట్లాడండి: ట్రోల్స్‌పై నటి గౌహర్ ఖాన్

‘ఇస్లాంలో మహిళలు ఎల్లప్పుడూ పురుషుల పాదాల వద్ద ఉంటారు’ అంటూ తన భర్తతో ఉన్న వీడియోతో ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లపై ‘తాండవ్’ నటి గౌహర్ ఖాన్ ఫైర్ అయింది. గత ఏడాది కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్‌ను గౌహర్ ఖాన్ పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా గౌహర్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో తన భర్త కాళ్ల దగ్గర పడుకుని ఉన్న వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోపై నెటిజన్లు ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ట్రోల్స్‌పై స్పందించిన గౌహర్ ఖాన్.. ‘‘ఇది ఓడిపోవడం కాదు.. దీనిని నచ్చిన విధంగా అని, ప్రేమ అని, స్నేహం అని పిలుస్తారు. ఇస్లాంలో స్త్రీ పురుషుని పైన లేదా క్రింద అనే భేదాలు ఉండవు. పురుషుని ప్రక్కన అంటే అతని హృదయానికి దగ్గరగా ఉంటుంది. ఇలాంటి చెత్త ట్రోల్స్ చేసే ముందు కాస్త తెలుసుకుని మాట్లాడండి’’ అని పేర్కొంది.