Advertisement
Advertisement
Abn logo
Advertisement

గణపర్తిలో గౌరీ పరమేశ్వరుల మహోత్సవం

మునగపాక, నవంబరు 27: మండలంలోని గణపర్తిలో శనివారం గౌరీ పరమేశ్వరుల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి సారెను భక్తులు  ఊరేగింపుగా తీసుకువెళ్లి  ఆలయంలో సమర్పించారు.   జడ్పీటీసీ సభ్యుడు పెంటకోట సోంబాబు, ఎంపీటీసీ సభ్యుడు గణేష్‌ స్వామిని దర్శించుకున్నారు. ఉత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. 

నేడు బండిమాంబ అమ్మవారి జాతర 
ఎలమంచిలి: ఏటికొప్పాక బండిమాంబ అమ్మవారి జాతర ను ఆదివారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. రాత్రి తీర్థ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. వరహానది ఒడ్డున బాణసంచా పేలుళ్లు  ప్రత్యేకత ఆకర్షణగా నిలవనున్నాయి.  
Advertisement
Advertisement