Advertisement
Advertisement
Abn logo
Advertisement

బుద్ధుని బోధ: మీ దు:ఖానికి కారణం మీరే.. దీనిని గ్రహిస్తే నిరంతరం ఆనందమే!

ఒకరోజు బుద్ధుడు ఒక నగరంలో పర్యటిస్తున్నాడు. ఆ నగరంలోని వారంతా బుద్ధునిపై వ్యతిరేక భావం కలిగివున్నారు. బుద్ధుడు తమ ధర్మాన్ని మంటగలుపుతున్నాడనే భావనలో వారంతా ఉన్నారు. ఫలితంగా వారంతా బుద్ధుడిని శత్రువుగా చూడసాగారు. నగరంలో పర్యటిస్తున్న బుద్ధుడిని పలు విధాలుగా నిందించసాగారు. బుద్ధుడు వారి మాటలను పట్టించుకోకుండా తన పర్యటనను కొనసాగించాడు. నగరంలోని వారంతా బుద్ధుడిని తమ మాటలతో విపరీతంగా అవమానించి అలసిపోయారు. అప్పుడు బుద్ధుడు వారితో ‘క్షమాపణలు కోరుతున్నాను.. మీరంతా అనాలనుకుంటున్న మాటలను పూర్తి చేశాకే ఇక్కడి నుంచి వెళతాను’ అని ప్రశాంతంగా పలికారు. 

ఈ మాటలు నగరంలోని వారందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే అక్కడున్న ఒక వ్యక్తి బుద్ధునితో మాట్లాడుతూ ‘సోదరా.. మేము నిన్ను పొగడటం లేదు. మిమ్మల్ని విపరీతంగా నిందిస్తున్నాం. వీటి ప్రభావం మీమీద ఏమాత్రం పడలేదా??’ అని అడిగాడు. దీనికి సమాధానంగా బుద్ధుడు.. ‘మీరు నన్ను ఎంతగా నిందించినా  అవి నాకు వర్తించవు. మీరు చేసే నిందలు నాపై ఎంతమాత్రం ప్రభావం చూపవు. ఎందుకంటే వాటిని నేను స్వీకరించలేదు. నేను ఈ నిందలను స్వీకరించనంత వరకూ అవి ఎక్కడ ఉంటాయి? ఖచ్చితంగా అవి మీ దగ్గరే.. మీ మనసుల్లోనే ఉంటాయి. అని అన్నారు. ఈ ఉదాహరణ ద్వారా ఎవరి దు:ఖానికి వారే కారణమని బద్ధుడు లోకానికి తెలియజేశాడు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement