బుద్ధుని బోధ: ‘ఆ అంటరానివాడిని రానివ్వకండి’ అని బుద్ధుడు అనగానే శిష్యులు నిశ్చేష్టులయ్యారు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-09T13:36:40+05:30 IST

శిష్యులకు ప్రవచనాలు చెప్పే బుద్ధుడు ఆరోజు మౌనంగా కూర్చున్నాడు.

బుద్ధుని బోధ: ‘ఆ అంటరానివాడిని రానివ్వకండి’ అని బుద్ధుడు అనగానే శిష్యులు నిశ్చేష్టులయ్యారు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..

శిష్యులకు ప్రవచనాలు చెప్పే బుద్ధుడు ఆరోజు మౌనంగా కూర్చున్నాడు. దీంతో శిష్యులు తమ గురువుగారి మౌనం వెనుకగల కారణమేమిటో తెలియక పరిపరి విధాల ఆలోచించసాగారు. గురువుగారికి అనారోగ్యం వాటిల్లిందని అనుకున్నారు. చివరికి ఒక శిష్యుడు.. బుద్ధునితో ‘‘గురువర్యా.. మీరు ఈ విధంగా మౌనంగా ఎందుకు ఉన్నారు?’’ అని అడిగాడు. దీనికి బుద్ధుడు సమాధానం చెప్పకపోవడంతో మరో శిష్యుడు.. ‘‘గురుదేవా.. మీరు ఆరోగ్యంగానే ఉన్నారా?’’ అని అడిగాడు. దీనికి కూడా బుద్ధుడు సమాధానం చెప్పలేదు. 


వెంటనే బుద్దుడు శిష్యుల మనోభావాలను గుర్తించి.. ‘‘అవును అతను అంటరానివాడే.. ఈరోజు అతను భార్యతో గొడవపడి ఇక్కడికి వచ్చాడు. కోపం వలన జీవితంలో శాంతి కరువవుతుంది. కోపం మానసిక హింసకు కారణమవుతుంది. అలాగే ఈ గుణం శారీరక హింసకు కూడా దారితీస్తుంది. కోపం కలిగిన వ్యక్తే నిజమైన అంటరానివాడు. కోపంతో ఊగిపోయే వ్యక్తి ప్రభావం ఇతరులపై పడుతుంది. అందుకే ఈరోజు అతనిని సత్సంగానికి అనుమతించ వద్దు. బయటనే ఉండనివ్వండి. అక్కడే ఉంటూ పశ్చాత్తాపంతో శుద్ధి పొందనివ్వండి..’’ అని అన్నాడు. అప్పుడు శిష్యులకు నిజమైన అంటరానితనమంటే ఏమిటో అర్థమయ్యింది. ఈ మాటలు విన్న బయటనున్న వ్యక్తి పశ్చాత్తాపం చెందాడు. ‘‘జీవితంలో మరెప్పుడూ కోపం తెచ్చుకోనని’’ బుద్ధునికి ప్రమాణం చేశాడు. దీంతో బుద్దుడు ఆరోజు సత్సంగానికి అతనికి అనుమతి కల్పించాడు.


ఇంతలో బయటి నుంచి ఒక వ్యక్తి వచ్చి.. ‘‘ఈరోజు మీరు సత్సంగంలో పాల్గొనేందుకు నాకు ఎందుకు అనుమతించలేదని’’ అడిగాడు. దీనికి కూడా బుద్ధుడు సమాధానం ఇవ్వలేదు సరికదా..కళ్లు మూసుకుని ధ్యానంలో మునిగిపోయాడు. దీంతో ఆ వ్యక్తి మరోమారు.. ‘‘నన్ను సత్సంగానికి ఎందుకు రానివ్వడం లేదు’’ అని అడిగాడు. దీనిని విన్న బుద్ధుని శిష్యుడొకరు.. ‘‘గురువర్యా.. అతనిని సత్సంగానికి హాజరయ్యేందుకు అనుమతినివ్వండి’’ అని వేడుకున్నాడు. బుద్ధుడు కళ్లు తెరిచి.. ‘‘వద్దు.. అతనిని సత్సంగానికి హాజరయ్యేందుకు అనుమతినివ్వవద్దు.. అతను అంటరానివాడు..’’ అని అన్నాడు. ‘‘అంటరానివాడా’’ అంటూ శిష్యులు ఆశ్చర్యపోయారు. గురువర్యులు ఇలా అంటరానితనం గురించి మాట్లాడటమేమిటని వారు మనసులో అనుకున్నారు. 



Updated Date - 2021-11-09T13:36:40+05:30 IST