రెండు సంవత్సరాల జీతాన్ని విరాళంగా ప్రకటించిన గంభీర్

ABN , First Publish Date - 2020-04-02T20:50:36+05:30 IST

గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలలకు ముందు రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచిన

రెండు సంవత్సరాల జీతాన్ని విరాళంగా ప్రకటించిన గంభీర్

న్యూఢిల్లీ: గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలలకు ముందు రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలిచిన టీం ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మరోసారి తన ఉదారతని చాటుకున్నాడు. దేశవ్యాప్తంగా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు సహాయంగా అతను ప్రధానమంత్రి సహాయనిధి(పీఎం-కేర్స్)కు తన రెండు సంవత్సరాల జీతాన్ని విరాళంగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించాడు. ఈ విషయాన్ని గంభీర్ ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. 


‘‘మనకు దేశం ఏం చేసిందని అందరు ప్రశ్నిస్తుంటారు. కానీ, మనం దేశానికి ఏం చేశామన్నది నిజమైన ప్రశ్న. నా రెండు సంవత్సరాల జీతాన్ని పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నాను. ఈ మంచి పని కోసం మీరు ముందుకు రావాలి’’ అంటూ గంభీర్ ట్వీట్ చేశాడు.  


అంతకు ముందు ఎంపీల స్థానిక సంస్థల అభివృద్ధి నిధుల నుంచి కోటి రూపాయిలను విడుదల చేసి.. కరోనా వ్యాప్తి నివారణ కోసం ప్రభుత్వానికి అందిస్తున్నట్లు గంభీర్ ప్రకటించాడు. 


గంభీర్‌తో పాటు ఇప్పటికే పలువురు క్రీడాకారులు, సెలబ్రిటీలు.. ఈ వైరస్‌పై పోరాటానికి సహాయార్థం తమకు తోచిన మొత్తాన్ని విరాళంగా అందించిన విషయం తెలిసిందే. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, సురేశ్ రైనా, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, ప్రముఖ షట్లర్ పీవీ సింధు.. తదితరులు ప్రభుత్వాలకు విరాళాలు అందించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-04-02T20:50:36+05:30 IST