Advertisement
Advertisement
Abn logo
Advertisement

బుద్ధుని ప్రవచనాల ప్రభావంతో ఆ కుర్రాడు.. తండ్రి హృదయాన్నే కదిలించాడు.. అందెలాగంటే..

ఒకప్పుడు గౌతమ బుద్ధుడు ఒక గ్రామంలో పర్యటిస్తున్నాడు. ఆ గ్రామంలోని ప్రజలంంతా బుద్దుని ప్రసంగాలు వినడానికి ఆయన దగ్గరకు వెళ్ళేవారు. అదే గ్రామానికి చెందిన ఏడేళ్ల కుర్రాడు గౌతమ బుద్ధుని ప్రసంగాలకు హాజరయ్యేవాడు. ఒకరోజు సాయంత్రం గౌతమ బుద్ధుని ఉపన్యాసం ముగియడంతో అందరూ వారి వారి ఇళ్లకు తిరిగివెళుతున్నారు. ఆ కుర్రాడి తండ్రి తన కుమారుడిని తీసుకొని వెళ్లడానికి అక్కడికి వచ్చాడు. దారిలో తండ్రి.. కొడుకుతో.. ‘ఈరోజు గౌతమబుద్ధుడు ఉపన్యాసంలో ఏమి చెప్పారు? అని అడిగాడు. దీనికి ఆ కుర్రాడు సమాధానమిస్తూ..ఈ రోజు గౌతమబుద్ధుడు నైతిక విద్యను బోధించారు. దీనిని అందరికీ తెలియజేయాలని చెప్పారు. పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఇతరులకు సహాయం చేయాలన్నారు. ఉపన్యాసం అనంతరం అందరూ ఇంటికివెళ్లాక ఎవరికైనా సహాయం చేయాలని, మర్నాడు ఎవరు ఎవరికి ఏమి సహాయం చేశారో చెప్పాలని బుద్ధుడు గ్రామస్తులందరికీ చెప్పారని తెలిపారు.

వారు అలా ముందుకు వెళుతుండగా అకస్మాత్తుగా వర్షం కురిసింది. ఈ వర్షంలో తడిసిపోతున్న ఒక పిల్లి పిల్ల ఆ కుర్రాడికి కనిపించింది. వెంటనే ఆ కుర్రాడు పిల్లి పిల్ల దగ్గరికి వెళ్లి  దానిని ఎత్తుకుని, అది తడవకుండా కాపాడాడు. దీనిని చూసిన ఆ కుర్రాడి తండ్రి.. నువ్వు వర్షంలో తడిసిపోతున్నావు. ఇలాగేవుంటే అనారోగ్యం వస్తుందని హెచ్చరించాడు.  అయినా ఆ కుర్రాడు తండ్రి మాట పట్టించుకోలేదు. వర్షం ఆగిపోయే వరకూ పిల్లి పిల్లను ఎత్తుకుని దానికి రక్షణ కల్పించాడు. తరువాత తండ్రితో మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుడు ఇతరులకు సహాయం చేయాలని తెలిపారు. నేను అదేపని చేశాను అని అన్నాడు. వర్షంలో చాలాసేపు తడిస్తే ఆ పిల్లి పిల్ల చనిపోయేదని, అందుకే దానిని కాపాడానని తెలిపాడు. కుమారునిలోని మంచి లక్షణాలను గ్రహించిన తండ్రి ఈ పిల్లి పిల్లను మన ఇంటికి తీసుకువెళ్లి సంరక్షిద్దాం అని అన్నాడు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement