కొడుకు ఓటమిపై ప్రతీకారం తీర్చుకుంటున్న గెహ్లాట్: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2020-08-03T00:44:03+05:30 IST

రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అసెంబ్లీ సమావేశంపై పట్టుపట్టి గవర్నర్ నుంచి అనుమతి పొందినప్పటికీ, ఆ సమావేశాలు ప్రారంభించడానికి గవర్నర్ రెండు వారాలకు పైగా సమయాన్ని కేటాయించారు

కొడుకు ఓటమిపై ప్రతీకారం తీర్చుకుంటున్న గెహ్లాట్: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: రాజస్తాన్ రాజకీయ సంక్షోభంపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రి గజేంద్ర శేకావత్ విమర్శలు గుప్పించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తన కొడుకు ఓటమిని జీర్ణించుకోలేని గెహ్లాట్.. ప్రతీకార చర్యలో భాగంగానే ఈ రాజకీయ నాటకానికి తెర తీశారని ఆరోపించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య తలెత్తిందని, ఇది కాంగ్రెస్ అంతర్గత గొడవని ఆయన అన్నారు.


ఇక రాజస్తాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధరా రాజే సింథియా మౌనంగా ఉండడంపై ఆయన స్పందిస్తూ.. ‘‘ఆమె మౌనం వెనుక చాలా స్ట్రాటజీ ఉంది. ఆమె మౌనం మాటల కన్నా పదునైనది, బలమైనది’’ అని అన్నారు.


రాజస్తాన్‌లో రాజకీయ సంక్షోభం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. అసెంబ్లీ సమావేశంపై పట్టుపట్టి గవర్నర్ నుంచి అనుమతి పొందినప్పటికీ, ఆ సమావేశాలు ప్రారంభించడానికి గవర్నర్ రెండు వారాలకు పైగా సమయాన్ని కేటాయించారు. ఈలోపు కాంగ్రెస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు ఉంటరా, ఉండరా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Updated Date - 2020-08-03T00:44:03+05:30 IST