ఈ జన్యువు ఉంటే.. కరోనాతో మరణించే ఛాన్స్ రెట్టింపు..!

ABN , First Publish Date - 2022-01-15T03:17:39+05:30 IST

కరోనా మహమ్మారి అనేక మందిని పొట్టన పెట్టుకుంది. ప్రస్తుతం ఒమైక్రాన్ ప్రపంచాన్ని అల్లాడిస్తోంది. మరోవైపు.. వైరస్ తీరుతెన్నులను, వ్యాధి తీవ్రతను అంచనా వేసే అధ్యయనాలు యుద్ధప్రాతిపదిక సాగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలాండ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

ఈ జన్యువు ఉంటే..  కరోనాతో మరణించే ఛాన్స్ రెట్టింపు..!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి అనేక మందిని పొట్టన పెట్టుకుంది. ప్రస్తుతం ఒమైక్రాన్ ప్రపంచాన్ని అల్లాడిస్తోంది. మరోవైపు.. వైరస్ తీరుతెన్నులను, వ్యాధి తీవ్రతను అంచనా వేసే అధ్యయనాలు  యుద్ధప్రాతిపదిక సాగుతున్నాయి. ఈ క్రమంలోనే పోలాండ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కరోనా కారణంగా మరణించే అవకాశాలను పెంచే జన్యువును తాము గుర్తించామని ఆ దేశ ఆరోగ్య శాఖ తాజాగా పేర్కొంది. ఈ జన్యువు ఉన్న వాళ్లు కరోనా కారణంగా మరణించే అవకాశం రెట్టింపవుతుందని పేర్కొంది. వ్యక్తుల్లో ఈ జన్యువు ఉన్న వాళ్లు ఎవరో తెలుసుకోవడం ద్వారా కరోనా మరణాలను నివారించే అవకాశం ఉందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. కాగా.. పోలాండ్‌లో ఇప్పటివరకూ లక్ష మంది కరోనాకు బలయ్యారు. 

Updated Date - 2022-01-15T03:17:39+05:30 IST