చివరి స్థానంలో ఉన్నా ప్రత్యేకతల్ని గుర్తిస్తా.. జెనీలియా ఎమోషనల్‌ పోస్ట్‌!

రితేశ్‌ దేశ్‌ముఖ్‌తో వివాహం, ఇద్దరు పిల్లలకు తల్లిగా మారిన తర్వాత సినిమాలు తగ్గించారు జెనీలియా. బాలీవుడ్‌లో బెస్ట్‌ జోడీల్లో ఓ జోడీగా ఈ జంట గుర్తింపు పొందింది. సినిమాలకు దూరమైనా తరచూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో టచ్‌లో ఉంటారు జెనీలియా. తాజాగా తన పెద్ద కుమారుడు రియాన్‌ 7వ పుట్టినరోజు సందర్భంగా ఇన్‌స్టాలో ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారామె!  ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌ కావడమే కాకుండా నెటిజన్ల హృదయాలను తాకుతోంది. ‘డియర్‌ రియాన్‌.. నీ చిట్టి బుర్రలో ఉన్న ఎన్నో కోరికలు, ఆశలను కచ్చితంగా నెరవేర్చుతా. నీ పుట్టినరోజు సందర్భంగా మాటిస్తున్నా. నువ్వు ఎగరాలనుకున్నప్పుడు నేను నీ రెక్కలను కాలేను కానీ, ఆ రెక్కల కింద గాలినవుతా. ప్రతి విషయంలోనూ నువ్వు మొదటి స్థ్థానంలోనే ఉండాలని నేను కోరుకోను. చివరి స్థానంలో ఉన్నా నీ ప్రత్యేకతల్ని నేను గుర్తిస్తాను. నిరాశ చెందను. ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటూ, నువ్వు ఒంటరివి కాకుండా చూస్తాను. పుట్టినరోజు శుభాకాంక్షలు రియాన్‌. ఐ లవ్‌ యూ మై బ్రేవ్‌ బాయ్‌’ అంటూ తల్లి ప్రేమను తన మాటల్లో చూపించారు జెనీలియా. తన ఇద్దరి పిల్లలతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. Advertisement

Bollywoodమరిన్ని...