ఆక్సిజన్ అందక కరోనా రోగులు మరణించిన నాలుగు రోజుల తర్వాత..

ABN , First Publish Date - 2020-07-14T20:48:33+05:30 IST

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్ట ర్‌ నాగేశ్వర్‌రావు సూపరింటెండెంట్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మెడికల్‌ కళాశాలలో ఆర్థోపెడిక్‌ ప్రొఫెసర్‌గా పూర్తిస్థాయి లో సేవలు అందిస్తానని తెలిపారు.

ఆక్సిజన్ అందక కరోనా రోగులు మరణించిన నాలుగు రోజుల తర్వాత..

గంటల వ్యవధిలో మరణాల ఎఫెక్ట్..

జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రాజీనామా


నిజామాబాద్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్ట ర్‌ నాగేశ్వర్‌రావు సూపరింటెండెంట్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మెడికల్‌ కళాశాలలో ఆర్థోపెడిక్‌ ప్రొఫెసర్‌గా పూర్తిస్థాయి లో సేవలు అందిస్తానని తెలిపారు. గత కొన్ని రోజులుగా జరుగతున్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌కు వివరించానని ప్రకటించారు. కరోనా లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి జనరల్‌ ఆసుపత్రిలో ఒక టీమ్‌గా పనులు చేశామని, ప్రస్తు తం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. 

 

కరోనా మృతుల ఆందోళనతోనే నిర్ణయం

జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో నాలుగు రోజుల క్రితం కరోనాతో ముగ్గురు మృతిచెందారు. వారికి ఆక్సిజన్‌ అందకనే చనిపోయారని బంధువులు ఆరోపించారు. అర్ధరాత్రి ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మృతదేహాల తరలింపు కూడా వివాదాస్పదమైంది. ఈ తరలింపులో అంబులెన్సులు అందు బాటులో లేకపోవడంతో ఒకరి మృతదేహాన్ని ఆటోలో తరలించడం మరింత వివాదమైంది. ఉన్నతాధికారులు కూడా వీటిపైన నివేదిక కోరినట్లు తెలుస్తోంది. ఆక్సిజన్‌ సరఫరా, మృతదేహాల తరలింపు తర్వాత ఎక్కువ మొత్తంలో ఒత్తిళ్లు రావడం వల్లనే సూపరింటెండెంట్‌ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి నెలలో కరోనా మొదలైనప్పటి నుంచి టీమ్‌ వర్క్‌ చేస్తూ పదుల సంఖ్యలో రోగులకు సేవలందించినా సివియర్‌ కేసులు, ఇతర సమస్యలు ఉండడం వల్ల ముగ్గురు మృతిచెందినా ఆక్సిజన్‌ వల్లనే చనిపోవడంపైన అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు వివరణలు కోరడంతో ఆయన కొంత మేర మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యుల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గడిచిన నెల రోజులుగా కేసుల సంఖ్య ఎక్కువగా రావడం, ఎక్కువ మంది లక్షణాలు ఉన్న వారు ఆసుపత్రిలో చేరడం వల్ల ప్రజాప్రతినిదులతో పాటు ఇతరుల నుంచి ఒత్తిళ్లు కూడా పెరిగినట్లు తె లుస్తోంది. ఆసుపత్రిలో 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందించినా పలువురు మృతిచెందిన తర్వాత బంధువుల ఆరోపణలు ఇతర విమర్శలు రావడం వల్లనే ఆయన రాజీనామను చేస్తున్నట్లు డీఎంఈకి చెప్పినట్లు తెలిసింది. ఈ విషయంపై ఆయనను ‘ఆంధ్రజ్యోతి’ ప్ర శ్నించగా ధ్రువీకరించారు. ఒత్తిళ్లు, వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రొఫెసర్‌గా సేవలందిస్తాన ని తెలిపారు.


జనరల్‌ ఆసుపత్రిలో కలకలం

డాక్టర్‌ నాగేశ్వర్‌రావు సూపరింటెండెంట్‌ పదవికి రాజీనామా చే స్తున్నట్లు ప్రకటించడంతో ఆసుపత్రిలో కలకలం మొదలైంది. కరో నా కేసులు తీవ్రమవుతున్న సమయంలో సూపరింటెండెంట్‌ రాజీనామా చేస్తే కొత్తవారిని నియమించినా టీమ్‌వర్క్‌ మొదలయ్యే వ రకు ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్ధితు ల్లో ప్రతీరోజు కేసులు పెరుగుతుండడం, ఎక్కువ మంది ఆసుపత్రి కి వస్తుండడంతో ఐసోలేషన్‌ వార్డులతో పాటు ఐసీయూలో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. కొంత మందిని హోంక్వారంటైన్‌లో ఉంచి సేవలను అందిస్తున్నారు. ప్రతీరోజు కేసులతో పాటు పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య కూడా పెరుగుతండడంతో సేవలు అందించేందుకు సిబ్బంది తిప్పలు పడుతున్నారు. 


ఆసుపత్రికి ప్రజాప్రతినిధుల దూరం

జిల్లాలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఆసుపత్రి వైపు ప్రజాప్రతినిదులు వెళ్లడం లేదు. ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కు వ కావడంతో ప్రజాప్రతినిధులెవరూ ఆసుపత్రి వైపు వెళ్లడం లేదు. కిందిస్థాయి నేతలు తమ బంధువులు వచ్చినప్పుడు వెళ్లడం తప్పి తే ముఖ్య నేతలు ఆ వైపు వెళ్లడం లేదు. జిల్లాతో పాటు ఇతర జి ల్లావాళ్లు కూడా ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నా ప్రజాప్రతినిధు లు మాత్రం ఇప్పటి వరకు ఆసుపత్రిని పరిశీలించలేదు. జిల్లా కేం ద్రంలోని ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్‌ వచ్చిన తర్వాత ఆ సుపత్రికి వెళ్లేందుకే ప్రజలు కూడా జంకుతున్నారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లి పరిశీలిస్తున్నారు. వైద్యులు, అధికారులు సమన్వయంతో పనిచేసే లా చూస్తున్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు మాత్రం ఫోన్‌లో ఎప్పటికప్పుడు వైద్యులతో సమీక్షిస్తున్నారు.

Updated Date - 2020-07-14T20:48:33+05:30 IST