పురుషుల కోసం ప్రత్యేక ప్లాటినం ఆభరణాలు

ABN , First Publish Date - 2021-10-14T16:27:29+05:30 IST

పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లాటినం ఆభరణాలను ప్రముఖ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఆవిష్కరించారు. ప్లాటినం గిల్డ్‌ ఇండియా రూపొందించిన అద్భుతంగా రూపొందించిన ఈ ఆభర

పురుషుల కోసం ప్రత్యేక ప్లాటినం ఆభరణాలు

చెన్నై: పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్లాటినం ఆభరణాలను ప్రముఖ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ ఆవిష్కరించారు. ప్లాటినం గిల్డ్‌ ఇండియా రూపొందించిన అద్భుతంగా రూపొందించిన ఈ ఆభరణాలలో ప్లాటినం గొలుసులు, ఉంగరాలు, బ్రాస్‌లేట్‌ తదితరాలెన్నో వున్నాయని నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. ప్రతిరోజూ కొత్త సవాళ్లతో, కఠినమైన నిర్ణయాలను కొన్ని క్షణాల్లోనే తీసుకోవాల్సి వుంటుందని, ఆ కీలక క్షణాల్లోనే మన పాత్ర, మన విలువ పరీక్షించబడుతుందన్నారు. తనకు తన శైలికి ప్లాటినం సరిగ్గా సరిపోతుందన్నారు. ఇదిలా వుండగా ప్లాటినం ఆభరణాలు రాష్ట్రంలోని ప్రముఖ షోరూంలలో అందుబాటులో వున్నాయి.

Updated Date - 2021-10-14T16:27:29+05:30 IST