Advertisement
Advertisement
Abn logo
Advertisement

జియో... మళ్ళీ అతి చవకైన ప్లాన్...

ముంబై : జియో వినియోగదారులకు వెసులుబాటు కల్పిస్తేూ... అతి చవకైన ప్లాన్ మళ్లీ వచ్చేసింది. బఈ ప్లాన్‌కు సంబంధించిన వెసులుబాట్లు ఇలా ఉన్నాయి. రూ. 98 రీఛార్జ్‌నుజియో  తిరిగి ప్రవేశపెట్టింది. దాదాపు సంవత్సరం పాటు ఆ ఈ ప్లాన్ అమలులో లేదు. ఇప్పుడు ఈ ప్లాన్‌ను జియో మళ్లీ ప్రారంభించింది. అయితే... మునపటి మాదిరిగా 28 రోజుల వ్యాలిడిటీ కాకుండా ఈ ప్లాన్ 14 రోజులు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ జియో అందిస్తున్న రీచార్జ్ ప్లాన్స్‌లో చాలా చవకైనది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


రూ .98 ప్లాన్.. . 

కొత్త రూ. 98 డేటా ప్లాన్ ప్రకారం వినియోగదారులు రోజుకు 1.5 జీబీ డేటా క్యాప్‌తో మొత్తం 21 జీబీ డేటాను పొందవచ్చు. పధ్నాలుగు రోజుల పాటు చెల్లుబాటయ్యే ఈ ప్యాక్ ద్వారా, జియో నుండి జియో నెంబర్లకు అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు జియో యాప్స్‌ను సైతం ఉపయోగించుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ తదితర ప్రయోజనాలున్నాయి.  జియో అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా యూజర్లు రూ . 98 ప్లాన్‌ను రీచార్జ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా. మై జియో యాప్, గూగుల్ పే, పేటీఎం నుంచి కూడా ఈ ప్లాన్‌ను పొందవచ్చు.

Advertisement
Advertisement