81 ఏళ్ల వయసులో టిక్‌టాక్ స్టార్‌గా.. విపరీతంగా ఫ్యాన్‌ఫాలోయింగ్.. ఎలాగంటే..

ABN , First Publish Date - 2021-02-27T01:51:51+05:30 IST

బామ్మకు యువతలో యామా ఫాలోయింగ్. ఈ బామ్మ వీడియోలకు లైకులు షేర్ల వరద వచ్చిపడుతుంది. ఇదెలా సాధ్యమైందంటే..

81 ఏళ్ల వయసులో టిక్‌టాక్ స్టార్‌గా.. విపరీతంగా ఫ్యాన్‌ఫాలోయింగ్.. ఎలాగంటే..

ఇంటర్నెట్ డెస్క్: ప్రజల్లో విపరీతంగా పాపులారిటీ సంపాదించాలంటే..ఒకటే మార్గం సినిమాల..! కానీ.. ఇది ఒకప్పటి మాట! ఆధునిక సాంకేతికత తెచ్చిన మార్పుల కారణంగా పాపులారిటీ తెచ్చిపెట్టే ఎన్నో కొత్త వేదికలు ప్రస్తుతం మనముందున్నాయి. టిక్‌టాక్, యూట్యూబ్ వంటివి ఈ కోవలోకే వస్తాయి.  పాపులారిటీతో పాటూ ఇవి మంచి సంపాదనా మార్గులుగా మారాయి. అనేక మంది తమ తమ రోజువారి ఉద్యోగాలు వదులుకుని మరీ ఈ వేదికలపై తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే..ఈ వేదికలతో ఉన్న మరో సౌలభ్యం.. వయసు అడ్డంకి లేకపోవడం. ఏ వయసులో ఉన్నవారైనా సరే.. తమ దగ్గర మంచి కంటెంట్ ఉందని నమ్మితే..నిర్భ్యతంరంగా తన సృజనాత్మకతను ఈ వేదికల ద్వారా ప్రజలతో పంచుకోవచ్చు. రాత్రికి రాత్రికి స్టార్లుగా మారిపోవచ్చు. అంటువంటి ఓ బామ్మ కథే ప్రస్తుతం మనం చెప్పుకోబోతున్నాం. 


ఈ బామ్మ పేరు ఎరికా రిష్కో. వయసు 81.. ఉండేది జర్మనిలో! ఇంత పెద్దవయసులోనూ ఆమె యువ ఉత్తేజం ఉరకలేస్తుంటుంది. లాక్ డౌన్ సందర్భంగా ప్రపంచం మొత్తం ఇంటికే పరిమితమైన సమయంలో ఆమె ఓ టిక్‌టాక్‌లో ఓ వీడియో పెట్టారు. యువతను తలదన్నేలా ఎరికా కసరత్తులు చేస్తున్న వీడియో అది. ఆ విపరీతంగా వైరల్ అవడంతో ఎరికాకు పాపులారిటీ ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. అది మోదలూ...నేటి వరకూ ఎరికా 100కు పైగా ఎక్సర్‌సైజుల వీడియోలు అప్‌లోడ్ చేశారు. కేవలం కసరత్తుల వీడియోలే కాకుండా.. అప్పుడప్పుడూ తన భర్తతో కలసి డ్యాన్స్ చేస్తూ ఫన్నీ వీడియోలను కూడా టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేస్తుంటుంది. అలా ఓ మూల కూర్చోకండి.. లేచి ఎదోకటి చేయడం అంటూ తన వీడియోలను చూసే వారిలో స్ఫూర్తి నింపుతుంటుంది..ఎరికా. అంతేనా..కసరత్తులకు సంబంధించి తన అభిమానులు విసిరే సవాళ్లను కూడా యువకిశోరానికి మల్లే దీటుగా ఎదుర్కొంటుంది. బహుశా అందుకేనేమో..ఆమెకు యువతలోనూ  పిచ్చ  పాపులారిటీ ఉంది. ఇంతకీ ఆమెకు ఉన్న ఫాలోవర్లు సంఖ్య అక్షరాలా 1.25 లక్షలు! దటీజ్ ఎరికా.. ట్యాలెంట్ ఉత్సాహం ఉన్న వారికి తిరుగే లేదని మరోసారి రుజువు చేసింది ఎరికా..!

Updated Date - 2021-02-27T01:51:51+05:30 IST