జర్మనీ, కొరియా వ్యూహం మేలు
ABN , First Publish Date - 2020-04-08T05:35:16+05:30 IST
కరోనా పోరాటంలో ముందుచూపుతో వ్యవహరించాలి. అనుమానితులనందరినీ పరీక్షించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడటం, ప్రాణ గండం నుంచి మిగతా వారిని రక్షించడం అవసరం...
కరోనా పోరాటంలో ముందుచూపుతో వ్యవహరించాలి. అనుమానితులనందరినీ పరీక్షించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడటం, ప్రాణ గండం నుంచి మిగతా వారిని రక్షించడం అవసరం. ఈ విషయంలో జర్మనీ, దక్షిణ కొరియా వ్యూహాలను అనుసరించాలి. మలమూత్రాలపై వాలే ఈగల ద్వారా కూడా వైరస్ వ్యాపించే ప్రమాదముందని అంటున్నారు. అదే నిజమైతే వర్షాకాలంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. మురుగు కాలువలు, డ్రైనేజీ వ్యవస్థల పైన జాగ్రత్తలు తీసుకోవాలి. బహిరంగ మల మూత్ర విసర్జనలను పూర్తిగా నిషేధించాలి.
జక్కుల వరప్రసాద రావు