యుద్ధానికి సిద్ధంకండి

అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ కలిస్తే ఎలా ఉంటుందన్న ఊహతో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటించారు. డివివి దానయ్య నిర్మాత. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్రైలర్‌ కూడా వచ్చేస్తోంది. డిసెంబరు 3న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ట్రైలర్‌ని విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటి వరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు, మేకింగ్‌ వీడియోలకు మంచి స్పందన వచ్చింది. అవన్నీ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’పై అంచనాలు పెంచేశాయి. మరి ట్రైలర్‌ ఇంకెన్ని సంచలనాలకు తెర లేపుతుందో..?  అలియాభట్‌, అజయ్‌ దేవగణ్‌, శ్రియ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు.


Advertisement