బట్టలు కొనడానికి షాపింగ్ మాల్‌కు వెళ్లిన మహిళకు షాకింగ్ అనుభవం.. చోరీ ఆరోపణలతో బట్టలు విప్పించి..

ABN , First Publish Date - 2021-12-23T22:50:28+05:30 IST

ఆమె బట్టలు కొనడానికి షాపింగ్ మాల్‌కు వెళ్లింది.. బట్టలు తీసుకుని ట్రైల్ రూమ్‌లోకి వెళ్లింది..

బట్టలు కొనడానికి షాపింగ్ మాల్‌కు వెళ్లిన మహిళకు షాకింగ్ అనుభవం.. చోరీ ఆరోపణలతో బట్టలు విప్పించి..

ఆమె బట్టలు కొనడానికి షాపింగ్ మాల్‌కు వెళ్లింది.. బట్టలు తీసుకుని ట్రైల్ రూమ్‌లోకి వెళ్లింది.. తను కొనాలనుకున్న బట్టలు తీసుకుని బిల్ కౌంటర్ వద్దకు వెళ్లింది.. ఈ లోపు షాప్‌లో పనిచేసే వ్యక్తి వచ్చి ఒక డ్రెస్ కనిపించడం లేదని ఆమె బ్యాగ్ చెక్ చేశాడు.. అందులో లేకపోవడంతో ఓ మహిళా గార్డు ఆమెను లోపలికి తీసుకెళ్లి బట్టలన్నీ విప్పించి తనిఖీ చేసింది.. అయినా ఆమె దగ్గర ఏమీ దొరకలేదు.. అందరి ముందూ అలా చేయడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుని పోలీస్ స్టేషన్‌కు చేరింది.. అక్కడ కూడా ఆమెకు షాకింగ్ అనుభవం ఎదురైంది. 


రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న వరల్డ్ ట్రేడ్ పార్క్ మాల్‌కు బాధిత మహిళ సోమవారం సాయంత్రం వెళ్లింది. ఆ మాల్‌లో ఉన్న బట్టల దుకాణంలోకి వెళ్లింది. కొన్ని డ్రెస్‌లు తీసుకుని ట్రైల్ రూమ్‌కు వెళ్లింది. బయటకు వచ్చి రెండు డ్రెస్‌లు తీసుకుని క్యాష్ కౌంటర్ దగ్గరకు వెళ్లింది. అయితే ఒక డ్రెస్ మిస్ అయిందంటూ ఆ షాప్ సిబ్బంది మహిళ బ్యాగ్ చెక్ చేశారు. అందులోనూ లేకపోవడంతో ఆమెను అందరూ చూస్తుండగా చెకింగ్ రూమ్‌లోకి తీసుకెళ్లారు. 


అక్కడ ఓ మహిళా గార్డు ఆమెను బట్టలన్నీ విప్పించి గాలించింది. అయినా ఏమీ దొరక్కపోవడంతో బాధిత మహిళను వదిలేశారు. అయితే అందరి ముందూ అవమానం జరిగిందనే కారణంతో ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకుని బయటకు వెళ్లింది. అక్కడి నుంచి తన కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మాల్ సిబ్బందిపై ఫిర్యాదు చేసింది. అయితే కేసు నమోదు చేసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. దీంతో బాధిత మహిళ ఏఎస్పీని ఆశ్రయించింది. ఆయన ఆదేశాలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-12-23T22:50:28+05:30 IST