పిల్లలను సిద్ధం చేయండిలా...

ABN , First Publish Date - 2021-09-08T05:30:00+05:30 IST

చాలాకాలం తరువాత పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. స్కూల్‌కు పంపేందుకు పిల్లలను రెడీ చేయాల్సిన సమయం ఇది. కొవిడ్‌ భయం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు...

పిల్లలను సిద్ధం చేయండిలా...

చాలాకాలం తరువాత పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయి. స్కూల్‌కు పంపేందుకు పిల్లలను రెడీ చేయాల్సిన సమయం ఇది. కొవిడ్‌ భయం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఈ సమయంలో పిల్లలతో పాటు తల్లిదండ్రుల్లోనూ భయాందోళనలు నెలకొని ఉన్నాయి. అయితే పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించి స్కూల్‌కు సిద్ధం  చేయాలి. ఇంకా ఏం చేయాలంటే...


  1. చాలారోజుల తరువాత పిల్లలు మళ్లీ స్కూల్‌కు వెళుతున్నారు. సంతోషించే విషయమే అయినా మనసులో ఏదో భయం. అయితే మాస్క్‌ ధరించడం, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ముప్పు ఉండదు. ఇదే విషయాలను పిల్లలకు వివరించాలి.
  2. పిల్లల్లో కూడా యాంగ్జయిటీ ఉంటుంది. కాబట్టి పిల్లలతో మాట్లాడాలి. సౌకర్యంగా ఫీల్‌ అయ్యేలా చూడాలి. కొత్త షెడ్యూల్‌కు అలవాటు పడేంత వరకు సహాయంగా ఉండాలి. 
  3. పిల్లలకు వ్యాక్సిన్‌ ఇప్పటి వరకు అందుబాటులో లేదు. ఇది తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేసే అంశమే. అయితే జాగ్రత్తలు తీసుకుంటే భయపడాల్సిన పనిలేదని చెప్పాలి.
  4. స్కూల్‌లో స్నేహితులందరూ ఉంటారు. ఒంటరిగా ఫీల్‌ కావద్దు అనే విషయాన్ని పిల్లలకు వివరించాలి.

Updated Date - 2021-09-08T05:30:00+05:30 IST