జీజీహెచ్‌లో పడకల సామర్థ్యం పెంచేందుకు చర్యలు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-05-09T07:37:01+05:30 IST

కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి సంబంధించి ఎక్కువ సంఖ్యలో కొవిడ్‌ కేసులు వస్తున్నందున పడకల సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు.

జీజీహెచ్‌లో పడకల సామర్థ్యం పెంచేందుకు చర్యలు : కలెక్టర్‌
జీజీహెచ్‌లో శనివారం కొవిడ్‌ వార్డులను సందర్శిస్తున్న కలెక్టర్‌న మురళీధర్‌రెడ్డి, జేసీ కీర్తి

జీజీహెచ్‌(కాకినాడ), మే 8: కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి సంబంధించి ఎక్కువ సంఖ్యలో కొవిడ్‌ కేసులు వస్తున్నందున పడకల సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం జీజీహెచ్‌లోని ఈఎన్‌టీ బ్లాక్‌ వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను, కొవిడ్‌ వార్డులను జాయింట్‌ కలెక్టర్‌ చేకూరి కీర్తి, వైద్యాధికారులతో కలిసి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇక నుంచి జీజీహెచ్‌లో కొవిడ్‌ వైద్యం పొందిన ఐదు రోజుల తర్వాత ఆరోగ్యం స్థిరంగా ఉన్నవారిని కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు లేదా డిశ్చార్జి చేయడం జరుగుతుందన్నారు. అలాగే జిల్లాలో ఆక్సిజన్‌ కొరత రానివ్వకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టడం జరుగుతోందని తెలిపారు. ఇప్పటికే రెండు వారాల కిందట 1.7 కేఎల్‌ పీఎస్‌ఏ యూనిట్‌ను ప్రారంభించామన్నారు. మరో వారం రోజుల్లో 10 కేఎల్‌ సామర్థ్యం కలిగిన ఆక్సిజన్‌ సిలిండర్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. దీంతో జిల్లాలో ఆక్సిజన్‌ కొరత లేకుండా ఉంటుందన్నారు. అనంతరం జీజీహెచ్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ ఆవరణలో 10 కేఎల్‌  సామ కలిగిన ఆక్సిజన్‌ సిలిండర్‌ ఏర్పాటు పనులను కలెక్టర్‌, జేసీ పరిశీలించారు. ఈ పర్యటనలో కలెక్టర్‌ వెంట జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.వెంకటబుద్ధ, ఆర్‌ఎంవో డాక్టర్‌ ఇ.గిరిధర్‌, జీజీహెచ్‌ నోడల్‌ అధికారి ఎం.భానుప్రకాష్‌, ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.



Updated Date - 2021-05-09T07:37:01+05:30 IST