పడకల్లేక..వైద్యం అందక!

ABN , First Publish Date - 2021-05-11T05:14:41+05:30 IST

నెల్లూరులోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో (జీజీహెచ్‌) కరోనా బాధితుల పరిస్థితి వర్ణణాతీతంగా ఉంటోంది.

పడకల్లేక..వైద్యం అందక!
పడకలు లేక నేలమీదే పడుకొని ఉన్న బాధితులు

 జీజీహెచ్‌లో కరోనా బాధితుల అవస్ధలు


నెల్లూరులోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో (జీజీహెచ్‌) కరోనా బాధితుల పరిస్థితి  వర్ణణాతీతంగా ఉంటోంది. ఆక్సిజన్‌ పడకల కోసం బాధితులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. సకాలంలో పడకలు అందకపోవడంతో ఓపీ వద్దే బాధితులు పడిగాపులు పడుతున్నారు. ఆక్సిజన్‌ అత్యవరమైన వారికి అక్కడే కుర్చీలలో కూర్చోబెట్టి వైద్య సిబ్బంది ఆక్సిజన్‌ అందిస్తున్నారు. ఇంకొందరు పడకల కోసం గచ్చుమీదే పడుకుని వేచి ఉంటునానరు. కరోనా బాధితుల అవస్థలు గమనించి ఇప్పటికైనా అధికారులు పడకలు ఏర్పాటు చేయాలని బంధువులు కోరుతున్నారు.

- నెల్లూరు (వైద్యం) 



Updated Date - 2021-05-11T05:14:41+05:30 IST