ఆన్‌లైన్‌లో పారా మెడికల్‌ సిబ్బంది ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌

ABN , First Publish Date - 2022-01-29T06:56:32+05:30 IST

కాకినాడ జీజీహెచ్‌ లో ఏడాది కాలానికి తాత్కాలిక పద్ధతిలో పారా మెడికల్‌ సిబ్బంది అభ్యర్థుల ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌ను ఆన్‌లైన్‌లో ప్రదర్శించినట్లు జిల్లా నియామక ఎంపిక కమిటీ ఛైర్మన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఆన్‌లైన్‌లో పారా మెడికల్‌ సిబ్బంది ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌

జీజీహెచ్‌(కాకినాడ), జనవరి 28: కాకినాడ జీజీహెచ్‌ లో ఏడాది కాలానికి తాత్కాలిక పద్ధతిలో పారా మెడికల్‌ సిబ్బంది అభ్యర్థుల ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌ను ఆన్‌లైన్‌లో ప్రదర్శించినట్లు జిల్లా నియామక ఎంపిక కమిటీ ఛైర్మన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పారామెడికల్‌ సిబ్బంది భర్తీకోసం గతేడాది నవంబరు 17న నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు తెలిపారు. ప్రొవిజినల్‌ మెరిట్‌ లిస్ట్‌లో వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. తమ విద్యార్హతకు చెందిన అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తీసు కుని ఈనెల 31న ఉదయం 11 గంటలకు హాజరుకావాలని కోరారు. నకిలీ ధ్రువపత్రాలు కలిగిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Updated Date - 2022-01-29T06:56:32+05:30 IST