Advertisement
Advertisement
Abn logo
Advertisement

జీజీహెచ్‌లో పలు ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్‌

డిసెంబర్‌ 15 దరఖాస్తుకు ఆఖరు తేదీ 

గుంటూరు (మెడికల్‌), నవంబరు 30: రాష్ట్ర వైద్య విద్య సంచాలకుల ఉత్తర్వుల మేరకు గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో ఖాళీగా ఉన్న పలు పారామెడికల్‌, నాల్గవ తరగతి ఉద్యోగాలను కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేస్తున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.నాగేశ్వరమ్మ తెలిపారు. జీజీహెచ్‌లో భర్తీచేసే వివిధ పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రేడ్‌-2 ల్యాబ్‌ టెక్నీషియన్‌ 19 పోస్టులు, గ్రేడ్‌-2 ఫార్మసిస్టులు 13 పోస్టులు, బయోమెడికల్‌ ఇంజనీర్‌ 1, ఫిజిసిస్ట్‌/న్యూక్లియర్‌ ఫిజిసిస్ట్‌ 1, రేడియేషన్‌ స్టేఫ్టీ ఆఫీసర్‌ 1, ల్యాబ్‌ అటెండెంట్‌ 2, ఆప్టోమెట్రిస్ట్‌ 3, రిఫ్రాక్షనిస్ట్‌ 3, ఫిజియోథెరపిస్ట్‌ 2, డెంటల్‌ హైజీనిస్ట్‌ 1, లేడీ హెల్త్‌ విజిటర్‌ 2, ఎంపీహెచ్‌ఏ (ఫిమేల్‌) 1, మార్చురీ మెకానిక్‌ 1, ఆడియోమెట్రి టెక్నీషియన్‌ 1, స్పీచ్‌ థెరపిస్ట్‌ 2, ఈసీజీ టెక్నీషియన్‌లు 10, కార్డియాలజీ టెక్నీషియన్‌ 1, క్యాత్‌ల్యాబ్‌ టెక్నీషియన్‌ 1, ఫర్ఫూషనిస్ట్‌ 2, రేడియోగ్రాఫర్లు 7, డార్క్‌ రూమ్‌ అసిస్టెంట్‌ 2, ఎంఆర్‌ఐ టెక్నీషియన్‌ 2, డయాలసిస్‌ టెక్నీషియన్‌ 5, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ 6, ఆపరేషన్‌ ఽథియేటర్‌ అసిస్టెంట్‌ 4, ఎంఎన్‌వో 22, ఎఫ్‌ఎన్‌వో 12 పోస్టులను భర్తీ చేస్తారు. డిసెంబర్‌ ఒకటి నుంచి 15వ తేదీ లోపు అభ్యర్థులు తమ దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. పూర్తి వివరాలకు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని డాక్టర్‌ నాగేశ్వరమ్మ కోరారు. 


Advertisement
Advertisement