జీజీహెచ్‌కు ఉత్తర అమెరికా ఆర్‌ఎంసీ వైద్యుల వితరణ

ABN , First Publish Date - 2021-06-21T08:09:06+05:30 IST

కరోనా సెకండ్‌వేవ్‌లో బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ అందించేందుకు తమ వంతు బాధ్యతగా ఉత్తర అమెరికా రంగరాయ వైద్యకళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ముందుకు వచ్చింది.

జీజీహెచ్‌కు ఉత్తర అమెరికా ఆర్‌ఎంసీ వైద్యుల వితరణ

జీజీహెచ్‌(కాకినాడ), జూన్‌ 20: కరోనా సెకండ్‌వేవ్‌లో బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ అందించేందుకు తమ వంతు బాధ్యతగా ఉత్తర అమెరికా రంగరాయ వైద్యకళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ముందుకు వచ్చింది. ఆదివారం కాకినాడ జీజీహెచ్‌లో ఆర్‌ఎంసీఏఎన్‌ఏ సంఘం ప్రతినిధి డాక్టర్‌ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మంత్రి వేణు, ఎంపీ వంగా గీత, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ద్వారా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహాలక్ష్మికి 20 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణు, ఎంపీ గీతలు మాట్లాడుతూ ఆస్పత్రి అభివృద్ధికి పూర్వ వైద్యవిద్యార్థులు తోడ్పాటు అందించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సిటీకి చెందిన ఆర్‌ఎంసీ వైద్యకళాశాల పూర్వవిద్యార్థుల ఆధ్వర్యంలో రూ.66వేల విలువైన ఫేస్‌షీల్డ్‌ మాస్క్‌లను హౌస్‌సర్జన్ల కోసం అందించారు. ఆక్సిజన్‌పై ఉన్న రోగులకు వివిధ పరీక్షల కోసం ల్యాబ్‌లకు పంపించేందుకు ఉపయోడపడే 10 ఆక్సిజన్‌ సిలిండర్‌ హోల్డింగ్‌ కేజీ ట్రాలీలను రూ.1,08,500 లక్షలతో డాక్టర్‌ ఎం.భానుప్రకాశ్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ సమకూర్చిన ట్రాలీలను సూపరింటెండెంట్‌కు అందించారు. కార్యక్రమంలో జేసీ కీర్తి చేకూరి, నోడల్‌ అధికారి ప్రవీణ్‌చంద్‌, సీఎస్‌ఆర్‌ఎంవో పద్మ, డీసీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ అనిత పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T08:09:06+05:30 IST