డాక్టర్‌ శివశంకరరావు సేవలు అమోఘం

ABN , First Publish Date - 2021-08-01T06:52:03+05:30 IST

నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో తనదైన శైలిలో వైద్యవృత్తి నిర్వహి స్తూ ఎంతోమంది రోగుల ప్రాణాలు కాపాడి, ప్రశంసలందుకున్న వారిలో డాక్టర్‌ కుర్రా శంకరరావు ఒకరని పలువురు వక్తలు ప్రశంసల జల్లు కురిపించారు.

డాక్టర్‌ శివశంకరరావు సేవలు అమోఘం

ప్రభుత్వాసుపత్రి, జూలై 31 : నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో తనదైన శైలిలో వైద్యవృత్తి నిర్వహి స్తూ ఎంతోమంది రోగుల ప్రాణాలు కాపాడి, ప్రశంసలందుకున్న వారిలో డాక్టర్‌ కుర్రా శంకరరావు ఒకరని పలువురు వక్తలు ప్రశంసల జల్లు కురిపించారు. శనివారం సాయంత్రం ఆయన పదవీ విరమణ సందర్భంగా సహచర వైద్యులు, సిబ్బంది ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో నిర్వహించిన ప్రత్యేక అభినందన సభలో ఆయనకు ప్రత్యేక గౌరవాన్ని ఇస్తూ ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా శంకరరావును ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందిస్తూ మరోవైపు సహచర వైద్యులను ఏకతాటిపైకి తీసుకువచ్చి వైద్యవృత్తికి ఎంతో పేరు, ప్రఖ్యాతలు తీసుకువచ్చారని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్శిటీ రిజిస్ర్టార్‌ డాక్టర్‌ శంకరరావు, మాజీ అడిషనల్‌ డీఎంఈ డాక్టర్‌ శశాంక్‌, డాక్టర్‌ అప్పారావు, డాక్టర్‌ సాంబశివరావు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్‌ జగన్‌మోహన్‌రావు, డాక్టర్‌ కిరణ్‌కుమార్‌తో పాటు పలువురు వైద్య సిబ్బంది పాల్గొని శంకరరావును ఘనంగా సన్మానించారు. ఇదే ఆసుపత్రిలో హెడ్‌నర్స్‌గా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన కె.ఎ్‌స.మల్లిక దంపతులను ఆసుపత్రి హెడ్‌నర్సులు, స్టాఫ్‌నర్సులు ఘనంగా సత్కరించారు.

జీజీహెచ్‌ ఇన్‌ఛార్జిగా డాక్టర్‌ జగన్మోహన్‌రావు 

విజయవాడ : ప్రభుత్వ ఆసుపత్రి ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా డాక్టర్‌ జగన్మోహన్‌రావు బాధ్యతలు స్వీకరించారు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ కె.శివశంకర్‌ శనివారం పదవీ విరమణ చేయటంతో ఇన్‌ఛార్జిగా డాక్టర్‌ జగన్మోహన్‌రావును నియమించారు. అయన్నే పూర్తిస్థాయిలో కొనసాగిం చే అంశాన్ని పరిశీస్తున్నట్లు తెలిసింది.

Updated Date - 2021-08-01T06:52:03+05:30 IST