ఘనంగా చింతామణి అమ్మవారి సంబరం

ABN , First Publish Date - 2021-04-14T05:28:10+05:30 IST

కవిటిలో చింతామణి అమ్మవారి సంబర మహోత్సవం మంగళ వారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా చింతామణి అమ్మవారి సంబరం
చింతామణి అమ్మవారిని ఊరేగిస్తున్న భక్తులు

కవిటి: కవిటిలో చింతామణి అమ్మవారి సంబర మహోత్సవం మంగళ వారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారి  గజముద్దలు, కాళికా నక్షత్రాలతో ఊరేగించి  ఆలయం వద్ద  మొక్కులు చెల్లించారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులు అమ్మవార్ని   దర్శించుకున్నారు. అలాగే  బల్లిపుట్టుకలో మంగళవారం సింధుపురాని అమ్మవారి ఉత్సవాలు గ్రామస్థులు నిర్వహించారు. అమ్మవారి గజముద్దను వైసీపీ నాయ కురాలు పి.విజయ ఊరేగించారు. 

స్వేచ్ఛావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు 

ఇచ్ఛాపురం/రూరల్‌: పట్టణంలోని స్వేచ్ఛావతి అమ్మవారి ఆల యం లో ఉగాది  పురస్కరించుకొని మహిళలు ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఉదయం అభిషేకాలు, కుంకమార్చనలతోపాటు  ఉగాది పచ్చడిని నైవేద్యంగా సమర్పించారు. బొడ్డకాళి వేంకటేశ్వరస్వామి, లొద్దపుట్టి తులసమ్మ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

ఇచ్ఛాపురం పట్టణంలోని కోదండరామాలయంలో వసంత నవరాత్రి ఉత్స వాలు ప్రారంభమయ్యాయి.ఽ దర్మకర్త పత్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. నవరాత్రి తొమ్మిది రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

శివపార్వతుల ప్రచార రథం...

ఇచ్ఛాపురంలో శివపార్వతుల ప్రచారరథాన్ని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ పిలక రాజ్యలక్ష్మి ప్రారంభించారు. బెల్లుపడ శుద్ధికొండపై  నిర్మించిన శివపార్వతులు, ఇతర విగ్రహాలను జూన్‌ 18 నుంచి 22వ తేదీ వరకు ప్రతిష్ఠించనున్నారు. ఈ మహోత్సవం గురించి చుట్టు పక్కల గ్రామాలకు తెలియజేసేందుకు ప్రచార రథం ఏర్పాటుచేశారు.  కార్యక్రమంలో ఆశి జీవులు రెడ్డి, త్రినాథస్వామి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంతోషిమాత ఆలయంలో..

గుజరాతీపేట: ఉగాది సందర్భంగా మంగళవారం పాతశ్రీకాకుళంలోని  సంతోషిమాత దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు మోదుకూరి కిరణ్‌శర్మ ఆధ్వర్యంలో సుప్రభాత, అభిషేక సేవ లతో పాటు  కుంకుమ పూజలు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు.  ఈవో వాకచర్ల రాధాకృష్ణ పాల్గొన్నారు. 


 


Updated Date - 2021-04-14T05:28:10+05:30 IST