Abn logo
Sep 27 2021 @ 22:44PM

ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

కలెక్టరేట్‌లో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌, తదితరులు

ఆసిఫాబాద్‌, సెప్టెంబరు 27: జిల్లాకేంద్రంలో తెలం గాణ స్వాతంత్య్ర సరయోధుడు కొండాలక్ష్మణ్‌ బాపూజీ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. కలె క్టరేట్‌లో బాపూజీ చిత్రపటానికి జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, అదనపుకలెక్టర్‌ వరుణ్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధం గా పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి భవనంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లికార్జున్‌ యాదవ్‌, పద్మశాలిసంఘం సభ్యులు అశోక్‌, శ్రీనివాస్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు కేశవరావు పాల్గొన్నారు.

కౌటాల: మండల కేంద్రంలో జయంతిని సోమ వారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యా లయం, పద్మశాలి సేవాసంఘం ఆధ్వర్యంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. ఎంపీపీ విశ్వనాథ్‌, పద్మశాలిసంఘం మండ లాధ్యక్షుడు సత్యనారాయణ, డీసీఎంఎస్‌ వైస్‌చైర్మన్‌ మాంతయ్య, ఎంపీవో శ్రీధర్‌రాజు, నాయకులు పాల్గొన్నారు. 

రెబ్బెన: బెల్లంపల్లిలోని గోలేటి జీఎం కార్యాలయం లో బాపూజీ చిత్రపటానికి ఇన్‌చార్జి జీఎం కృష్ణారావు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు, డీజీఎం రాజేంద్రప్రసాద్‌, అధికారులు లక్ష్మణ్‌రావు, రాజేశ్వర్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. నక్క లగూడ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.  కార్య క్రమంలో ఉపాధ్యాయులు శ్రీని వాసరావు, అనీల్‌ కుమార్‌, సదా నందం, తిరుపతి, శంకర్‌ పాల్గొన్నారు. 

చింతలమానే పల్లి/ బెజ్జూరు/ కెరమెరి: చింతల మానేపల్లి మండల కేంద్రంలోని తహ సీల్దార్‌, ఎంపీడీవో కార్యాలయాల్లో, బెజ్జూరు మండల కేంద్రంలో, కెరమెరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీపీ నానయ్య, తహసీల్దార్‌ రమేష్‌, డీటీ బీమ్లా, సీనియర్‌అసిస్టెంట్‌ నాం దేవ్‌, పాల్గొన్నారు.  బెజ్జూరులో తిరు పతి, వెంకటేష్‌, శ్రీనివాస్‌, శంకర్‌, రాజన్న, రవికాంత్‌, సంజీవ్‌, రమేష్‌, గణేష్‌, శేఖర్‌, సత్యనారాయణ పాల్గొ న్నారు. కెరమెరిలో అధ్యాపకులు నవీన్‌ రెడ్డి, కుత్బోద్దీన్‌, కిశోర్‌, బైరాగి, విమల్‌, శ్రీహరి, రాజు తదితరులు పాల్గొన్నారు.

దహెగాం: మండలంలోని తహసీ ల్దార్‌కార్యాలయం, జూనియర్‌ కళాశా లలో సోమవారం బాపూజీ చిత్రప టానికి తహసీల్దార్‌ రామ్మోహన్‌, ప్రిన్సి పాల్‌ అమరేందర్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. డీటీ బక్కయ్య, ఆర్‌ఐ మోహన్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

పెంచికలపేట: మండల కేంద్రంలో కొండాలక్ష్మణ్‌ బాపూజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు తిరుపతి, సర్పంచ్‌ రాజన్న, ఎంపీటీసీ రాజన్న, సాజీద్‌, శ్రీనివాస్‌, కొండయ్య పాల్గొన్నారు.

వాంకిడి: బాపూజీ జయంతిని సోమవారం మండలకేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. తహసీ ల్దార్‌, ఎంపీడీవో  కార్యాలయంతోపాటు మండల కేంద్రంలోని బీసీ కమ్యూనిటీ భవనంలో జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్బంగా బాపుజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిం చారు. కార్యక్రమాల్లో ఎంపీపీ ముండే విమలా బాయి, వైస్‌ఎంపీపీ రాజ్‌కుమార్‌, తహసీల్దార్‌ మధుకర్‌, లక్ష్మణ్‌, సేవాసదన్‌ చెర్మెన్‌ గాదేఅవినాష్‌, సభ్యులు పాల్గొన్నారు.