ఘనంగా నవచండీ హోమం

ABN , First Publish Date - 2021-07-23T05:15:33+05:30 IST

మండల పరిధిలోని ఉప్పరపల్లె గ్రామంలో గల సద్గురు సమర్ధనారాయణస్వామి ఆశ్రమంలో గురువారం సద్గురు సమర్ధ నారాయణ మహరాజ్‌ల ఆరాధన మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఘనంగా నవచండీ హోమం నిర్వహించారు.

ఘనంగా నవచండీ హోమం
నవచండీ హోమం నిర్వహిస్తున్న దృశ్యం

ప్రొద్దుటూరు రూరల్‌, జూలై 22: మండల పరిధిలోని ఉప్పరపల్లె గ్రామంలో గల సద్గురు సమర్ధనారాయణస్వామి ఆశ్రమంలో గురువారం  సద్గురు సమర్ధ నారాయణ మహరాజ్‌ల ఆరాధన మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఘనంగా నవచండీ హోమం  నిర్వహించారు. దీంతోపాటు పూర్ణాహుతి, గోపూజ మహోత్సవం, అన్నపూర్ణపూజ, శ్రీమహరాజ్‌ల చిత్రపటానికి ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రతాప మారుతీస్వామికి మహన్యాసపూర్వక ఏకాదశవార రుద్రాభిషేకం, మహానివేదన, మహామంగళహారతి, నిర్వహించారు. ఈ ఆరాధనోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.

Updated Date - 2021-07-23T05:15:33+05:30 IST