Abn logo
Oct 14 2021 @ 23:51PM

ఘనంగా సద్దుల బతుకమ్మ

నల్లగొండ పట్టణంలోని రాక్‌హిల్స్‌ కాలనీలో బతుకమ్మ ఆడుతున్న మహిళలు

నల్లగొండ కల్చరల్‌, అక్టోబరు 14 : బతుకమ్మ వేడుకల్లో చివరిదైన సద్దుల బతుకమ్మను గురువారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వ హించారు. గ్రామ, పట్టణ కూడళ్లు, చెరువుల వద్ద బతుకమ్మలను ఒక్కదగ్గరకు చేర్చి ఆడిపాడారు. పోయిరా బతుకమ్మ మళ్లిరా అంటూ నిమజ్జనం చేశారు. గౌరమ్మకు పూజ చేసి వాయినాలు ఇచ్చిపుచ్చు కున్నారు. జిల్లా కేంద్రమైన  నల్లగొండతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, హాలియా, చండూరు, నకిరేకల్‌తో పాటు మండల కేంద్రాల్లోనూ బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. 

నల్లగొండలో తోపుడుబండిపై బతుకమ్మను తీసుకువస్తున్న మహిళలుసంబరంగా సద్దుల బతుకమ్మ