Oct 27 2021 @ 13:13PM

'Ghani': అంచనాలు పెంచుతున్న ఫస్ట్ లిరికల్ సాంగ్

నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ 'గని'. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామాను అల్లు బాబీ నిర్మిస్తున్నారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సెన్షేషన్ ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్న 'గని' సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజైంది. 'గని ఆంథమ్' పేరుతో రిలీజైన ఈ టైటిల్ సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సాంగ్ సినిమాపై బాగానే అంచనాలు పెంచేస్తోంది. రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం అందించగా, ఆదిత్య అయ్యంగార్, శ్రీ కృష్ణ, సాయి చరణ్, పృథ్వి చంద్ర కలిసి పాడారు. ఇక ఈ సినిమాను డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేయనున్నారు.