గిఫ్ట్ కార్డుల పేరుతో ఘరానా మోసం

ABN , First Publish Date - 2021-03-02T02:19:20+05:30 IST

గిఫ్ట్ కార్డుల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న పదిమందిని

గిఫ్ట్ కార్డుల పేరుతో ఘరానా మోసం

హైదరాబాద్‌: గిఫ్ట్ కార్డుల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న పదిమందిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్‌ తెలిశారు. వీరిలో బీహార్ కి చెందిన ఐదుగురితో పాటు మంచిర్యాలకు చెందిన మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి దగ్గరి నుంచి 900 స్క్రాచ్‌ కార్డులు, 2 ల్యాప్‌ట్యాప్‌లు, 10 ఆధార్‌ కార్డులు, 28 డెబిట్‌ కార్డులు, 42 ఫోన్లు, 2 రబ్బర్‌ స్టాంపులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు దాదాపు రెండు కోట్ల రూపాయల వరకు మోసం చేసినట్లు సీపీ తెలిపారు.


 


వీరు వివిధ ఈ కామర్స్‌ వెబ్‌సైట్లు షాప్‌క్లూస్‌, క్లబ్‌ ఫ్యాక్టరీ, నాప్టాల్‌ నుంచి పలువురి ఫోన్‌ నంబర్లు సేకరించారని సీపీ తెలిపారు. వీరంతా కలిసి గిఫ్ట్‌ కార్డులు తయారు చేస్తారని సీపీ సజ్జన్నార్ పేర్కొనారు. ఈ గిఫ్ట్‌ కార్డులను స్క్రాచ్‌ చేసి కార్డుపై ఉన్న నంబర్‌కు కాల్‌ చేయమని ఉంటుంది. దీంతో కస్టమర్‌ కాల్‌ చేసి మాట్లాడిన భాష ప్రకారం టెలీకాలర్స్‌లా మాట్లాడి వారిని సులువుగా నమ్మించి డబ్బులు గుంజుతారు. గిఫ్ట్‌ పంపకుండా మోసానికి పాల్పడుతారు. ఒక్క సైబరాబాద్‌లోనే ఈ తరహా కేసులు మూడు నమోదయ్యాయని సజ్జనార్‌ తెలిపారు. 

Updated Date - 2021-03-02T02:19:20+05:30 IST