1100 కిమీలు ప్రయాణించి.. బెంగాల్ చేరిన నేపాల్ మొసలి!

ABN , First Publish Date - 2020-05-27T02:15:52+05:30 IST

అంతరించిపోతున్న సరీసృపాల జాబితాలో ఉన్న ఓ మొసలి పశ్చిమ బెంగాల్‌లో దర్శనమిచ్చింది.

1100 కిమీలు ప్రయాణించి.. బెంగాల్ చేరిన నేపాల్ మొసలి!

హుగ్లీ: అంతరించిపోతున్న సరీసృపాల జాబితాలో ఉన్న ఓ మొసలి పశ్చిమ బెంగాల్‌లో దర్శనమిచ్చింది. ఘరియాల్‌ అని పిలిచే ఈ మొసలి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. దీంతో ఇది ఎక్కడి నుంచి వచ్చిందా? అని అధికారులు ఆరాతీశారు. అప్పుడే వీరికి ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఈ మొసలిని కొన్ని రోజుల క్రితం నేపాల్‌ అధికారులు రాప్తి నదిలో విడిచిపెట్టారట. అక్కడి నుంచి 1100కిలోమీటర్లు ప్రయాణించిన ఇది.. హుగ్లీ సమీపంలోని రాణీ నగర్ ఘాట్‌లో జాలర్ల వలలకు చిక్కింది. తోకపై ఉన్న గుర్తుల ఆధారంగా ఇది నేపాల్ అధికారులు రాప్తి నదిలో విడిచిపెట్టిన మొసలని గుర్తించారు. ఈ విషయాన్ని వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూటీఐ) ట్విట్టర్‌లో పంచుకొంది. ఈ మొసలి రాప్తి- నారాయణి/గందక్-గంగా-ఫరాక్కా- హుగ్లీ నది మార్గంలో ఇక్కడికి చేరుకుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ మొసలి ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ జాతి మొసళ్లు గంగాదేవి వాహనాలని హిందువులు నమ్ముతారు.



Updated Date - 2020-05-27T02:15:52+05:30 IST